జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించిన అనంతరం మంత్రి హరీశ్ రావు జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. అన్ని వార్డులను కలియ తిరిగారు. ఏరియా ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. 50 పడకలతో ఎంసీహెచ్ కేంద్రాన్ని ఏరియా ఆసుపత్రిలో త్వరలో ఏర్పాటుచేస్తామన్నారు.కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు పెరిగాయాన్నారు. ప్రస్తుతం 52 శాతం డెలివరీలు జరుగుతున్నాయని దీన్ని 75 శాతంకు పెంచాలన్నారు. జహీరాబాద్ లోనూ ప్రభుత్వ ఆస్పత్రిలో నార్మల్ డెలివరీలు బాగా జరుగుతున్నాయన్న మంత్రి ఈ సందర్భంగా ఆస్పత్రి సిబ్బందిని అభినందించారు. అనవసరంగా సెక్షన్ సర్జరీలు చేయవద్దన్నారు.
దీని వల్ల తొలిగంటలో శిశువుకుఅందాల్సిన అమృతమైన పాలు అందడం లేదన్నారు. దీని వల్లశిశువులో రోగ నిరోథక శక్తి తగ్గిపోతుందన్నారు. దాదాపు మన రాష్ట్రంలోఇలా 66 శాతం మంది శిశువలకు తొలిగంటలో పాలు అందడం లేదన్నారు. ఈ అనవసర సర్జరీల వల్ల 35 ఏళ్లకే తల్లి ఆ రోగ్యం దెబ్బతింటుందన్నారు.ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భారత్ కింద ఏరియా ఆస్పత్రిలో చికిత్సలు చేయాలని ఆదేశించారు. డిపార్ట్మెంట్ల వారీగా పని తీరును అడిగి తెలుసుకున్నారు. మందులకొరత, నిధులకొరత ప్రభుత్వం రానివ్వదని, చక్కటి వైద్యం పేదలకు అందించాలని సిబ్బందికి మంత్రి సూచించారు.
