NTV Telugu Site icon

Naveen murder case: కత్తిని ముందే లవర్‌కు చూపిన హరిహరకృష్ణ.. నవీన్‌ శరీరబాగాలను హసన్ ఇంట్లో..

Naveen Case

Naveen Case

Naveen murder case: నవీన్‌ను హత్య చేసిన తర్వాత హరిహరకృష్ణ లవర్‌ను నాలుగుసార్లు కలిశాడు. నవీన్‌ను చంపేందుకు కొన్న గ్లౌజులు, కత్తిని కూడా హరిహరకృష్ణ ప్రేమికుడికి చూపించాడు. ఈ నెల 6వ తేదీన హరిహరకృష్ణ ప్రేమికుడు, స్నేహితుడు హసన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నవీన్ హత్యకేసుకు సంబంధించిన నేరాంగీకార వాంగ్మూలంలో పోలీసులు విచారణలో హరిహరకృష్ణ, హసన్, హరిహరకృష్ణ లవర్ చెప్పిన అంశాలను పొందుపరిచారు.

హైదరాబాద్‌లోని తన నివాసానికి హరిహరకృష్ణ ఒకసారి తీసుకెళ్లినట్లు పోలీసుల విచారణలో యువతి అంగీకరించింది. ఈ సమయంలో నవీన్‌ను చంపేందుకు కొన్న కత్తి, గ్లౌజులను హరిహరకృష్ణ ఆమెకు చూపించాడు. అయితే అదంతా ఫేక్ అని అనుకున్నానని చెప్పింది. గత నెల 17న అబ్దుల్లాపూర్ మెట్‌లో నవీన్‌ను హత్య చేసిన అనంతరం హరిహరకృష్ణ తన ప్రేయసికి, స్నేహితుడికి సమాచారం అందించాడు. అనంతరం హరిహరకృష్ణ బ్రాహ్మణపల్లిలోని తన స్నేహితుడు హసన్ ఇంటికి వెళ్లాడు. హసన్ ఇంటికి వెళ్తుండగా నవీన్ శరీర భాగాలను బ్యాగ్ లో పెట్టుకున్నాడు. ఈ మృతదేహాలను హసన్‌, హరిహరకృష్ణలు హసన్‌ ఇంట్లో గోనె సంచులలో వేసి బ్రాహ్మణపల్లి శివారులో ఉంచారు.

అయితే బ్రాహ్మణపల్లి శివారులో ఈ శరీర భాగాలు దొరికితే తన పేరు బయటకు వస్తుందని హసన్ భావించాడు. ఈ విషయాన్ని హరిహరకృష్ణకు చెప్పాడు. దీంతో బ్రాహ్మణపల్లిలో వేసిన గోనెసంచిని తీసుకెళ్లాడు. నవీన్‌ను హత్య చేసిన ప్రదేశానికి తీసుకెళ్లి శరీర భాగాలను దహనం చేశారు. ఈ ఘటనలో హరిహరకృష్ణకు హసన్ సహాయం చేశాడు. మరోవైపు ఈ సమయంలో అదే ప్రాంతంలో హరిహరకృష్ణ, తన లవర్ నిహారిక, హసన్‌ ఉన్నాడు. వారిద్దరూ నవీన్ మృతదేహం వద్దకు వెళ్లి ఆమెను ఘటనా స్థలానికి దూరంగా వదిలిపెట్టి శరీర భాగాలను దహనం చేశారని సమాచారం. నవీన్‌ను హత్య చేసిన తర్వాత హరిహరకృష్ణ, అతని లవర్‌ వనస్థలిపురం ప్రాంతంలో మూడుసార్లు కలిశారు. మరో సారి హస్తినాపురంలో యువతి ఇంటి దగ్గర కలుసుకున్నారు.

చదువుకునే రోజుల్లోనే నవీన్ , నిహారిక ప్రేమ

చదువుకునే రోజుల్లోనే నవీన్ , తన మధ్య ప్రేమ ఉందని ఆమె పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. తాను , నవీన్ గొడవపడితే హరిహరకృష్ణ సర్ధిచెప్పేవాడని పోలీసులకు చెప్పారు. అయితే కొన్ని కారణాలతో నవీన్ కు తనకు మధ్య గ్యాప్ ఏర్పడిందని ఆమె విచారణలో చెప్పారు. నవీన్ హత్య తర్వాత హరిహరకృష్ణ మాటలను తాను నమ్మినట్టుగా చెప్పాడు. పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటానని హరిహరకృష్ణ ధీమాగా ఉండేవాడని ఆ యువతి పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో ఉన్నారని ఈ కథనం విడుదల చేసింది. మరోవైపు యువతి బంధువు న్యాయవాది. హరిహరకృష్ణ ఈ హత్య కేసును ఆయనతో చర్చించారు. అయితే పోలీసులకు లొంగిపోవాలని సూచించారు. న్యాయవాది సలహా మేరకు హరిహరకృష్ణ పోలీసులకు లొంగిపోయాడు.

హరిహరకృష్ణ బంధువుల కోసం గాలింపు

నవీన్‌ను హత్య చేయడానికి ముందు నిందితుడు హరిహరకృష్ణ మూసారాంబాగ్‌లోని ఎస్‌బీఐ కాలనీలో నివాసం ఉంటున్న తన అక్క, బావలను కలిశాడు. ఐదు వారాల క్రితమే నవీన్‌ను హత్య చేయాలని భావించిన హరిహరకృష్ణ.. తన ఉద్దేశాన్ని అక్క, బావలకు వివరించినట్టుగా తెలస్తోంది. అయితే హరిహరకృష్ణ అక్క, బావ ఇద్దరూ శారీరక వికలాంగులు. ప్రస్తుతం నవీన్ హత్య కేసును విచారిస్తున్న పోలీసులు హరిహరకృష్ణ అక్క, బావలు ప్రస్తుతం ఎక్కడున్నారని గుర్తించే పనిలో ఉన్నారు.
MLC Kavitha: కవితకు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల మద్దతు.. దీక్షకు హాజరుకానున్న 16 పార్టీల ప్రతినిధులు..

Show comments