D. Sridhar Babu: వరంగల్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హనుమకొండలో ఐటీ కంపెనీని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. వరంగల్ వాసులకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ ఐటి కంపెనీను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అమెరికాను స్వదేశీ గడ్డ పై ప్రేమతో ఈ కంపెనీ ఏర్పాటు చేయడం ఉపాధి కల్పించడం గొప్ప ఆలోచన అన్నారు. హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ అభివృద్ధి చెందుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ అని తెలిపారు. వరంగల్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దుతామని అన్నారు. ప్రభుత్వం వరంగల్ జిల్లా ను పరిశ్రమలతో పాటు ఐటి ని అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
Read also: NVSS Prabhakar: రేవంత్ రెడ్డి హామీలతో కాంగ్రెస్ కు ఎలాంటి సంబంధం లేదు..!
విదేశాల్లో స్థిరపడిన వారిని కోరుతున్నాం తెలంగాణ అభివృద్ధికి కృషి చేయడం… అన్ని విధాలుగా ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. మామునూర్ విమానాశ్రయం ఏర్పాటు విషయంలో కేంద్రం పై ఒత్తిడి తీసుకొని వస్తామన్నారు. త్వరలో విమానాశ్రయం ఏర్పాటు జరుగుతుందని అన్నారు. వరంగల్ జిల్లాలో అనేక బహుళజాతీయ కంపెనీలను త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. సూక్ష్మ.. మధ్యతర పరిశ్రమల ఏర్పాటుకు కొత్త పాలసీని తీసుకురానున్నామని తెలిపారు. వరంగల్ జిల్లాలో ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు.
Satyabhama Movie: టాప్ 1 ప్లేస్‌లో ట్రెండ్ అవుతున్న కాజల్ అగర్వాల్ ‘సత్యభామ’!