Site icon NTV Telugu

Duddilla Sridhar Babu : ఇన్ఫోసిస్, టీసీఎస్ ఉద్యోగుల భవిష్యత్తు ఎక్కడ.?

Sridhar Babu

Sridhar Babu

Duddilla Sridhar Babu : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న H1B వీసాలపై కొత్త నిర్ణయాలను రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయం భారతీయ సాఫ్ట్వేర్ కంపెనీలకు, చిన్న, మధ్యస్థాయిలోని టెక్ ఫిర్మ్‌లకు పెద్ద ఇబ్బందిని కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ H1B వీసాల ఫీజులను 5 వేల డాలర్ల నుంచి లక్ష డాలర్ల వరకు పెంచారని, ఈ నిర్ణయం కింద అమెరికాలోని సుమారు 85,000 H1B వీసాలు ప్రభావితమవుతాయన్నారు. చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలు, అమెరికాలో సేవలందిస్తున్న భారత్ కంపెనీలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని శ్రీధర్ బాబు హెచ్చరించారు.

Bolarum Railway Staion : హైదరాబాద్ బోలారం స్టేషన్‌లో పట్టాలపై నడుస్తున్న ముగ్గురిని ఢీకొన్న రైలు

హిందూస్థాన్ దేశంలోని భారతీయ టెక్ కంపెనీలు, ముఖ్యంగా ఇన్ఫోసిస్‌లో లక్షన్నర మంది, టీసీఎస్‌లో సుమారు లక్ష ఇరువై వేల మంది ఉద్యోగులు H1B వీసాలతో పనిచేస్తున్నారని మంత్రి వివరించారు. ఆయన అభిప్రాయం ప్రకారం, ఈ నిర్ణయం విద్యార్థులు, ఉద్యోగార్థులు, నిపుణులు ఎదుర్కొనే అవకాశాలను కూడా తగ్గిస్తుంది, అమెరికా స్వంతంగా మేధావుల, టాలెంట్ వృద్ధికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నట్టు అనిపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. “భారత టెక్ కంపెనీలపై వచ్చే భారం, దౌత్యపరమైన సమస్యలకు కేంద్రం ఎందుకు స్పందించడం లేదు?” అని ప్రశ్నించారు. ఈ అనాలోచిత నిర్ణయం భారతీయ టాలెంట్, మేధావుల కలలను చాటుతూ, అమెరికాలో భారతీయ కంపెనీల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

Hyderabad : హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో రూ.12 కోట్లు విలువైన విదేశీ మాదకద్రవ్యాల స్వాధీనం

Exit mobile version