NTV Telugu Site icon

Gutta Sukender Reddy : ఫెడరల్ వ్యవస్థ దెబ్బ తింటోంది

అసెంబ్లీలోని ప్రాంగణంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కవితతో పాటు ఇతర ఎమ్మెల్సీలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఫెడరల్ వ్యవస్థ దెబ్బ తింటోందని ఆయన వ్యాఖ్యానించారు. దీని వల్ల రాష్ట్రాల హక్కులను కేంద్రం లాక్కుంటోందని ఆయన ఆరోపించారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన మండిపడ్డారు. ఈ దేశానికి అంబేద్క‌ర్ ఒక స్ఫూర్తిని అందించార‌ని తెలిపారు. పేద ప్ర‌జ‌ల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నారు. రైతుబంధు, ద‌ళిత బంధు లాంటి ప‌థ‌కాలు తీసుకొచ్చార‌ని పేర్కొన్నారు.