NTV Telugu Site icon

Gutha Sukhender Reddy: దేశ వ్యాప్తంగా గవర్నర్ల వ్యవస్థ భ్రష్టుపట్టింది

Gutha Sukhender Reddy

Gutha Sukhender Reddy

Gutta Sukender Reddy fires on Governor Tamilisai: దేశ వ్యాప్తంగా గవర్నర్ల వ్యవస్థ భ్రష్టుపట్టిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్‌ అయ్యారు. గవర్నర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు.. ఎవరైనా గౌరవం కాపాడుకోవాలని సూచించారు. ఇప్పటివరకు 7 బిల్లులు ఆపారు గవర్నర్ అంటూ ఆరోపించారు. మరి అభివృద్ధి ఎలా జరుగుతుంది? అంటూ ప్రశ్నించారు. ఈ విషయమై గవర్నర్ ఆలోచన చేయాలని సూచించారు. అసెంబ్లీ లో ఆమోదం తెలిపిన బిల్లులను కూడా ఆపడం ఏంటి? అంటూ మండిపడ్డారు. దేశవ్యాప్తంగా గవర్నర్ వ్యవస్థ భ్రష్టుపట్టి పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావ్యతిరేక పాలన చేస్తున్న కేంద్రపై పోరాటం మొదలైంది. నిజం పాలనలో కూడా ఎన్నో మంచి పథకాలు పెట్టారని అన్నారు. హైదరాబాద్ లో నిజం ఆఖరి వారసుడీ అంత్యక్రియలపై కూడా రాజకీయాలు చేయడం దుర్మార్గం అంటూ మండిపడ్డారు. ప్రోటోకాల్ పాటించడం లేదని గవర్నర్ చెప్పడంలో అర్ధం లేదన్నారు. గవర్నర్, ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీని రద్దు చేస్తారనే వార్తల్లో వాస్తవం లేదని ఆయన చెప్పారు. బడ్జెట్ సమావేశాలు పూర్తి కాకుండా అసెంబ్లీ ఎలా రద్దు చేస్తారని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ రద్దు విషయమై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వంపై తమ పోరాటం మొదలైందన్నారు.

Read also: Kishan Reddy: ఇప్పటి వరకు అగ్ని ప్రమాదాలైన బిల్డింగ్‌ లన్నీ అక్రమ కట్టడాలే

ఖమ్మంలో ఈ నెల 18వ తేదీన నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలో గవర్నర్ల వ్యవస్థపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అగాధాన్ని తెరమీదికి తీసుకు వచ్చాయి. దీనిపై స్పందించేందుకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నిరాకరించారు. కాగా.. ప్రభుత్వం మాత్రం ప్రోటోకాల్ ను నిరాకరించిందన్నారు. అయితే.. ప్రభుత్వం పంపిన బిల్లులను అధ్యయనం చేస్తున్నట్టుగా గవర్నర్ చెబుతున్నారు. కాగా.. గవర్నర్ వ్యవస్థకు ఇవ్వాల్సిన ప్రోటో కాల్ ను ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. ఈనేపథ్యంలో.. గత కొంతకాలంగా గవర్నర్ తమిళిసై, తెలంగాణ ప్రభుత్వం మధ్య అగాధం కొనసాగుతుంది. దీంతో.. అవకాశం వచ్చినప్పుడల్లా ప్రభుత్వంపై గవర్నర్ విమర్శలు చేస్తున్నారు. అయితే.. అదే స్థాయిలో గవర్నర్ పై మంత్రులు, బీఆర్ఎస్ నేతలు ఎదురు దాడికి దిగుతున్నారు. గతంలో కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని ప్రభుత్వం సిఫారసు చేసింది. అయితే కౌశికర్ రెడ్డికి గవర్నర్ ఈ ఫైలును తిప్పి పంపింది. దీంతో మరో కోటాలో కౌశిక్ రెడ్డికి ప్రభుత్వం ఎమ్మెల్సీని కేటాయించింది. ఈవిషయమై అప్పటి నుండి ప్రభుత్వం, గవర్నర్ మధ్య మాటల యుద్ధం సాగుతున్న విషయం తెలిసిందే.
Gas Cylinder: గ్యాస్‌ సిలిండర్‌పై అదనపు డబ్బులు ఇవ్వడం ఆపేయండి.. లేదంటే..