Site icon NTV Telugu

Telangana: రెండోసారి శాసనమండలి ఛైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి

తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌గా ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఎన్నికకు ఒకే నామినేషన్ రావడంతో గుత్తా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండలి అధికారులు తెలిపారు. కమ్యూనిస్టుగా రాజకీయాల్లోకి వచ్చిన గుత్తా సుఖేందర్‌రెడ్డి 2004లో టీడీపీ తరపున నల్గొండ ఎంపీగా గెలిచారు. 2009లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ తరఫున అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2019లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా గెలుపొందారు.

శాస‌నమండ‌లి ఛైర్మన్‌గా రెండోసారి ప‌ద‌వీ బాధ్యత‌లు స్వీక‌రించిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డికి మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి గ‌ర్వకార‌ణం ఉందంటే తెలంగాణ సీఎం కేసీఆర్ కావ‌డం, శాస‌న‌స‌భ స్పీక‌ర్‌గా పోచారం శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిల్ ఛైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి కావడమేనన్నారు. ఎందుకంటే ఈ ముగ్గురూ రైతు బిడ్డలు కావ‌డం విశేషమని కేటీఆర్ మండలిలో వ్యాఖ్యానించారు. రైతు బిడ్డలే అత్యున్నత‌ రాజ్యాంగ ప‌ద‌వుల్లో ఉండ‌టం తెలంగాణ ప్రజల అదృష్టమని కేటీఆర్ తెలిపారు.

Exit mobile version