NTV Telugu Site icon

గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న గుత్తా జ్వాల,విష్ణు విశాల్ దంపతులు

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్ లో మొక్కలు నాటారు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాల,సినీనటుడు విష్ణు విశాల్ దంపతులు. ఈ సందర్భంగా విష్ణు విశాల్,గుత్తా జ్వాల మాట్లాడుతూ పర్యవరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు.

గ్రీన్ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టి ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ కి అభినందనలు తెలియజేశారు.ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటే ఆవకాశం కలిగినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి ఇరువురు కృతజ్ఞతలు తెలియజేశారు.ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.అనంతరం రవితేజ,డైరెక్టర్ మను ఆనంద్ కి విష్ణు విశాల్ గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు. కార్యక్రమం అనంతరం విష్ణు విశాల్,గుత్తాజ్వాల కి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ వృక్షవేదం పుస్తకాన్ని బహుకరించారు.