Site icon NTV Telugu

Gurukul Exam : ముగిసిన గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష

Gurukul Exams

Gurukul Exams

గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (VTG SET-2022 ) ప్రశాంతంగా ముగిసింది. గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో 2022 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు లక్షా 34వేల 478 మంది బాలబాలికలు హాజరయ్యారు. గత విద్యా సంవత్సరంలో 74వేల 52మంది మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. 90.91% విద్యార్థుల హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో 48 వేల120 మంది విద్యార్థులకు ప్రవేశాలు లభిస్తాయి. ఒక్క సీటు కోసం సగటున ముగ్గురు విద్యార్థులు పోటీ పడ్డారు.

 

ప్రభుత్వం పెద్ద సంఖ్యలో గురుకులాలను ప్రారంభించడం, వీటిలో ఉచితంగా ఇంగ్లీష్ మీడియంలో ఉన్నత  ప్రమాణాలతో కూడిన విద్యతో పాటు పోషకాహారాన్ని అందిస్తుండడంతో ప్రవేశాల కోసం పోటీ బాగా పెరిగింది. గురుకులాలకు సంబంధించి ప్రతిష్టాత్మకమైన ఈ ప్రవేశ పరీక్షను విజయవంతంగా నిర్వహించినందుకు గాను సంక్షేమ శాఖ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్, అన్ని సొసైటీలకు చెందిన అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఇదే ఉత్సాహంతో ఫలితాలు త్వరితగతిన ప్రకటించి, అడ్మిషన్స్ సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.

Exit mobile version