Site icon NTV Telugu

Minister Srinivas Goud : గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు అంకితం

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లాలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త జోగినపల్లి సంతోష్ కుమార్ సూచనల మేరకు రాష్ట్ర ఆబ్కారీ, క్రీడ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో పచ్చదనాన్ని పెంపొందించడంలో భాగంగా విత్తన బంతులను తయారు చేసి విత్తన బంతులతో అతి పెద్ద వాక్యాన్ని ఏర్పాటు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సృష్టించారు. అయితే ఈ అవార్డు ను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు హైదరాబాద్ లో బేగంపేట లోని టూరిజం ప్లాజా హోటల్ లో అంకితం ఇచ్చారు.

గత సంవత్సరం మహబూబ్‌నగర్ జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాలు కేవలం 10 రోజుల్లో రెండు కోట్ల 8 లక్షల 24 వేల విత్తన బంతులను తయారు చేయడమే కాక తయారు చేసిన విత్తన బంతులతో అతిపెద్ద వాక్యాన్ని రూపొందించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన విషయం తెలిసిందే. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించడంలో భాగస్వాములైన వారికి అభినందనగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు పంపిన సర్టిఫికెట్ ల ప్రధానం కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లోని హోటల్ హరిత ప్లాజా లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ముఖ్య అతిథి గా హజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున పచ్చదనాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం సంతోషకరమన్నారు. అంతేకాక దేశంలోనే అతిపెద్దదైన 2087 ఎకరాలలో కేసీఆర్‌ అర్బన్ ఎకో పార్క్ ను చేపట్టి అందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు. విత్తన బంతులతో అతి పెద్ద వాక్యం రూపొందిందించి గిన్నిస్ రికార్డ్ సాధించి దానిని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు అంకితం చేయడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version