సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలం సలాక్ పూర్ గ్రామంలో విషాదం నెలకొంది. ఎయిర్ గన్ మిస్ ఫైర్ కావడంతో ముసాఫ్ ఖాన్ అనే యువకుడు మృతి చెందాడు. సలాక్ పూర్ గ్రామంలో ఫజిల్ అనే వ్యక్తి ఇంటికి వచ్చారు ఎనిమిది మంది హైదరాబాద్ స్నేహితులు. రాత్రి విందు చేసుకొనే క్రమంలో షికారుకు వెళ్ళారు.
ఆసమయంలో ఎయిర్ గన్ మిస్ ఫైర్ అయింది. దీంతో మిషాక్ అనే యువకుడి తలకు బలంగా తగిలింది. దీంతో గాయపడిన మిషాక్ ని సలాక్ పూర్ నుండి సిద్దిపేటకు ఆస్పత్రికి తీసుకొని వెళ్తుండగా మార్గ మధ్యంలో మృతిచెందాడు.
