Site icon NTV Telugu

మొక్కలు నాటడంలో గిన్నీస్‌ బుక్‌ రికార్డు..!

planting

planting

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హరితహారం పేరుతో చెట్లు నాటడం, పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించింది కేసీఆర్‌ ప్రభుత్వం… ప్రతీఏడాది 20 కోట్లకు పైగా మొక్కలు నాటుతున్నారు.. నాటడమే కాదు.. వాటి రక్షణకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇక, ఆదిలాబాద్‌ జిల్లాలో గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు కోసం మొక్కలు నాటే కార్యక్రమానికి సిద్ధమయ్యారు. ఆదిలాబాద్‌ జిల్లా లో గంటలో లక్షన్నర మొక్కలు నాటే కార్యక్రమం ద్వారా గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు ఎక్కనున్నారు.. ఈఒక్కరోజే పది లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు పూర్తి చేయగా.. దుర్గానగర్ లో మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరుకానున్నారు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్… ఇప్పటికే టర్కీ పేరిట లక్ష మూడు వేల మొక్కలు నాటిన రికార్డు ఉండగా.. దాన్ని తిరగరాసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.

Exit mobile version