Site icon NTV Telugu

Group 1 Prelims Exam: రేపు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

Group 1

Group 1

Group 1 Prelims Exam: రాష్ట్రంలోని 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్ష ఈ నెల 9న (ఆదివారం) ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. OMR విధానంలో నిర్వహించే ఈ పరీక్షకు TGPSC విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 4.03 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్న ప్రిలిమ్స్ కోసం 895 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అత్యధికంగా 105 కేంద్రాలు ఉన్నాయి. అభ్యర్థులను ఉదయం 9 గంటల నుంచి కేంద్రాల్లోకి అనుమతిస్తామని కమిషన్ చెప్పారు. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు అంటే 10 గంటల తర్వాత గేట్లను మూసివేస్తామని స్పష్టం చేసింది. అభ్యర్థులందరూ హాల్‌టికెట్‌పై గత మూడు నెలల్లో తీసిన పాస్‌పోర్టు ఫోటోగ్రాఫ్‌ను అతికించాలని, హాల్‌టికెట్‌తో పాటు ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి తీసుకురావాలని సూచించారు.

Read also: Fire Accident : ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..ఆరుగురి పరిస్థితి విషమం

అభ్యర్థులందరికీ బయోమెట్రిక్ తప్పనిసరి, బయోమెట్రిక్ అందించని అభ్యర్థుల జవాబు పత్రాలు మూల్యాంకనం చేయబడతాయి. గ్రూప్-1 పరీక్షలో అనుసరించాల్సిన సూచనల గురించి కమిషన్ ఇప్పటికే అభ్యర్థులను ప్రతిరోజూ SMS రూపంలో అప్రమత్తం చేస్తోంది. హాల్‌టికెట్‌, ప్రశ్నపత్రంపై ముద్రించిన సూచనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. పరీక్షా కేంద్రాలను సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. ప్రతి పరీక్షా కేంద్రానికి సిట్టింగ్‌ స్క్వాడ్‌ను నియమించగా, 3 నుంచి 5 కేంద్రాలను తనిఖీ చేసేందుకు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ల బృందాలను ఏర్పాటు చేశారు. నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. అభ్యర్థులు ఏ4 సైజు పేపర్‌పై లేజర్ కలర్ ప్రింట్‌తో హాల్ టికెట్ తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మూడు నెలల్లోపు తీసిన ఫొటోను దానిపై అతికించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Vande Bharat Express : పెరుగుతున్న వందే భారత్ రైళ్ల సంఖ్య.. తగ్గుతున్న రైళ్ల వేగం(వీడియో)

Exit mobile version