గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఇప్పటికే ఎంతోమందితో మొక్కలు నాటిస్తున్నారు. సెలబ్రిటీలు కూడా ఈ మొక్కల ఉద్యమంలో విరివిగా పాల్గొంటూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ రూపాన్ని రావి ఆకుపై చిత్రించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ముక్ర కె గ్రామ సర్పంచ్ మీనాక్షి గాడ్గే రావి ఆకుపై సంతోష్ చిత్రాన్ని చిత్రించడంతో అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా మొక్కలతోనే మనిషి మనుగడ ఆధారపడి ఉందని.. అందుకే ప్రతిఒక్కరూ ప్రకృతి పరిరక్షణకు మొక్కలు నాటాలని మీనాక్షి గాడ్గే పిలుపునిచ్చారు.
Santosh Kumar: రావి ఆకుపై గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త

Santosh Kumar