Site icon NTV Telugu

రేపు, ఎల్లుండి నిలిచిపోనున్న తెలంగాణ ప్రభుత్వ వెబ్ సైట్స్

రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వ వెబ్ సైట్స్ నిలిచిపోనున్నాయి. యూపీఎస్ స్థాయి పెంపు నేపథ్యంలో ప్రభుత్వం వెబ్‌ సైట్లకు తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. ఈ నెల 9 నుండి 11వ తేదీ వరకు ప్రభుత్వ వెబ్ సైట్లకు అంతరాయం ఏర్పడనుంది. ఈ అంతరాయం కారణంగా ప్రభుత్వానికి సంబంధించిన ఉత్తర్వుల జారీ నిలిచిపోనుంది.

read also : కరీంనగర్‌ జిల్లాలో కోళ్లకు వింత వ్యాధులు !

అంటే.. ఈ రెండు రోజుల పాటు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ కావు. తెలంగాణ రాష్ట్రంలో ఈ సేవల వినియోగం పెరగడంతో.. అన్ఇంటరప్టబుల్ పవర్ (యూపీఎస్‌) కు అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో కొత్త యూపీఎస్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అటు శుక్రవారం నుంచి ఆదివారం రాత్రి వరకు ఏర్పడే అంతరాయాల గురించి అన్ని శాఖలకు ప్రభుత్వం ఇప్పటికే సమాచారం ఇచ్చింది.

Exit mobile version