కరీంనగర్‌ జిల్లాలో కోళ్లకు వింత వ్యాధులు !

కరీంనగర్‌ జిల్లాలో బాయిలర్‌ కోళ్లు వింత వ్యాధికి గురై మృత్యువాత పడుతున్నాయి. ఎదిగిన కోళ్లు విక్రయించే సమయంలో వేలల్లో చనిపోవడంతో పౌల్ట్రీ ఫారం యజమానులు తీవ్రంగా నష్టపో తున్నారు. నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. వింత వ్యాధులు నుండి కోళ్లను కాపాడుకోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో బ్రాయిలర్ కోళ్ల పెంపకం ఉపాధిగా వందల సంఖ్యలో కోళ్ల ఫారాలు ఏర్పడ్డాయి. దాదాపు 50 లక్షలకు పైగా కోళ్లను పెంచుతున్నారు. అయితే వింత రోగాలతో వేలాది కోళ్లు మృతి చెందుతున్నాయి. దీంతో పెంపకందార్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ప్రస్తుతం కోడి పిల్ల ధర 25 రూపాయలులు ఉండగా కిలో కోడికి 112 రూపాయలు ధర ఉంది. రెండు కిలోల బరువు పెరగాలంటే 45 రోజులు కోళ్లకు దాన ఇవ్వాల్సి ఉంటుంది.

read also : నేడు​ షర్మిల రాజకీయ పార్టీ అధికారిక ప్రకటన

ఇక ఒక కోడి నాలుగు కిలోలు దాన తింటూ ఉండగా కిలో దానా ముప్పై మూడు రూపాయల చొప్పున 132 రూపాయలు అవుతుంది. మందులుకి పది రూపాయలు మరో పది రూపాయలు నిర్వహణ ఖర్చు అవుతుంది. కోడి పిల్ల ధర 25 రూపాయలు ఉండగా మొత్తం ఖర్చు 175 రూపాయలు అవుతుంది..రెండు కిలోల కోడి రెండు వందల ఇరవై నాలుగు రూపాయల ఉండటంతో కొంత గిట్టుబాటు అవుతుందని ఆశిస్తున్నా తరుణంలో అకారణంగా కోళ్లు చనిపోతుండటంతో పెంపకందారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.

గడిచిన నాలుగు నెలలుగా 80శాతం కోళ్లు.. వింత వ్యాధులతో మృతి చెందాయి.దీంతో ఆర్థికంగా నష్టం వాటిల్లడంతో కోళ్లఫారాలు యజమానులు ఆవేదన చెందుతున్నారు.. చనిపోయిన కోళ్లను ప్రత్యేక స్థలాల్లో గుంతలు తవ్వి పూడ్చి పెడుతున్నారు. గతంలో కరోనా సమయంలో భారీగా నష్టం వాటిల్లగా మరోసారి వింత వ్యాధులు కోళ్ల ఫారాలపై ఎఫెక్ట్ పడింది.45 రోజులు పెంచిన తర్వాత కోళ్లు అమ్మే టైంలో మృత్యువాత పడుతున్న సమయంలో పౌల్ట్రీ పరిశ్రమ కరీంనగర్ జిల్లాలో కుదేల వుతోంది. ప్రస్తుత పరిస్థితిలో ధర ఉన్న కోళ్లు మృత్యువాత పడటంతో వేలాదిగా చనిపోతుం డటంతో కోళ్ల ఫారాలు బంద్‌ చేసుకుంటామంటున్నారు పౌల్ట్రీ ఫారం యజమానులు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-