NTV Telugu Site icon

TG Government: జూడాలకు సర్కార్ గుడ్ న్యూస్.. స్టైఫండ్‌ విడుదల చేసిన ప్రభుత్వం

Tg Governament

Tg Governament

TG Government: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్‌ రెసిడెన్స్‌ వైద్యులు, మెడికల్‌ కాలేజీ, పారమెడికల్‌ వాళ్లకు 2024-25కి సంబంధించిన స్టైఫండ్‌ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. రూ.406 కోట్లు విడుదల చేస్తున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఏడాదికి సరిపడా స్టైఫండ్‌ ను ముందే విడుదల చేస్తున్నట్లు సర్కార్‌ ప్రకటించింది. సమ్మెను విరిమించుకోవాలని తెలిపింది. 2024-25 సంవత్సరానికి గాను స్టెఫెండ్ ను విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. జూనియర్ డాక్టర్ల డిమాండ్లను పూర్తి చేసే దిశగా పూర్తి ప్రణాకంగా వ్యవహరించి వెల్లడిస్తామని తెలిపారు.

Read also: Mallu Bhatti Vikramarka: నేడు శ్రీశైలానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..

మొదటగా స్టెఫెండ్ ను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. జూడాల సమ్మె పిలుపుతో స్పందించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రామార్క జూడాల డిమాండ్లలను పరిశీలించారు. వైద్యానికి పెద్ద పీట వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రుణమాఫీ లో కోతలు ఉండవని క్లారిటీ ఇచ్చారు. ఇచ్చిన మాటకంటే ముందే రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే నిధుల విడుదల జీవో మీ ముందుకు తెస్తామన్నారు. ప్రజల సొమ్ము.. ప్రజలకే పంచుతున్నామని క్లారిటీ ఇచ్చారు. కోతలు పెట్టాల్సిన పని లేదన్నారు. రైతు భరోసా పై త్వరలోనే మార్గదర్శకాలు సిద్ధం చేస్తామన్నారు. నిధులు సమకూర్చుకోవడం కోసం మా తిప్పలు మేం పెడుతున్నామన్నారు. మాట నిలబెట్టుకునేందుకు అన్నీ రకాల శ్రమ పెడుతున్నామన్నారు. అయితే మరోవైపు ఇవాళ స్టెఫెండ్ ను సకాలంలో ఇవ్వాలని కోరుతూ ఇవాళ జూడాలు సమ్మె కొనసాగుతుందని తెలిపారు. తమ డిమాండ్స్ నెరవేరేదాకా సమ్మె కొనసాగుతుందని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ వెల్లడించారు. వారి డిమాండ్లను ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. నాలుగు రోజులుగా చేస్తున్నా సమ్మెపై ప్రభుత్వం దిగి వచ్చి పరిష్కారం చూపినందుకు ధన్యవాదాలు తెలిపారు. 2024-25 సంవత్సరానికి గాను స్టెఫెండ్ ను విడుదల చేస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఙతలు తెలిపారు. మా డిమాండ్లు వెంటనే పరిశీలించాలని, సమ్మె కొనసాగించతామని తెలిపారు.
Tamilnadu : తమిళనాడుకు చెందిన 22మంది మత్స్యకారులను అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ

Show comments