గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్‌తో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి… హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురవగా.. ఏకంగా 14 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ కేంద్రం.. అయితే, తెలంగాణలో భారీ వర్షాలపై గవర్నర్ తమిళిసై ఆరా తీశారు. సీఎస్ సోమేష్‌కుమార్‌కు ఫోన్ చేసిన గవర్నర్ తమిళిసై.. వర్షాలు, వరదల గురించి అడిగి తెలుసుకున్నారు.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక, ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని గవర్నర్ తమిళిసై సూచించారు. మరోవైపు.. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో.. ఈ నెల 28వ తేదీ (మంగళవారం) విద్యాసంస్థలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.
భారీ వర్షాలపై గవర్నర్ తమిళిసై ఆరా

Governor Tamilisai