NTV Telugu Site icon

Governor Tamilisai: ఆవిషయం తెలిసి షాక్‌కి గురయ్యా.. గవర్నర్ ట్వీట్

Govenor Tamilisai

Govenor Tamilisai

Governor Tamilisai: ఆదిభట్ల యువతి కిడ్నాప్‌పై గవర్నర్ తమిళిసై స్పందించారు. విషయం తెలిసి షాక్‌కి గురయ్యానని ట్వీట్‌ చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ట్వీట్‌ ద్వారా డీజీపీని కోరారు. పోలీసులు నిందితుడిని పట్టుకొని అమ్మాయికి, అమ్మాయి కుటుంబానికి భద్రత, భరోసా కల్పించాలి గవర్నర్‌ తమిళిసై ట్వీట్టర్‌ పోస్ట్‌ చేశారు.

తెలంగాణలో సంచలనం కలిగించిన డాక్టర్ కిడ్నాప్ కేసు పోలీసులు ఛేధించిన విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్లలో తన ఇంటి నుంచి డా. వైశాలి ఇంట్లో చొరబడిన నవీన్, గ్యాంగ్ దాడి నానా హంగామా చేసి, వైశాలిని కిడ్నాప్ చేశారు. దీంతో వైశాలి తల్లిడండ్రులు పోలీసులకు ఆశ్రయించడంతో కిడ్నాప్‌ కు గురైన డా. వైశాలి కథకు తెరదించారు. అయితే ఇవాళ డాక్టర్‌ వైశాలకి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కావడంతో వైశాలిని ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాయించేందుకు తీసుకెళ్లేందుకు పేరెంట్స్ సిద్దమయ్యారు. బేగంపేట్ లో ఎగ్జాం రాయించెందుకు తండ్రి తీస్కెళ్లనున్నారు.

ఉదయం 11 గంటలకు వైశాలి ఐలెట్స్ ఎగ్జాo రాయనుంది. నిన్న రాత్రి తండ్రితో పోలీసులు మాట్లాడించారు. ప్రస్తుతం వైశాలి ఎక్కడ ఉందో బయటకు తెలియనియకుండా జాగ్రత్త పడుతున్నారు. నవీన్‌ గ్యాంగ్‌ మళ్లీ తన కూతురికి ఏహాని చేస్తుందో అని భయాందోళన నడుమ పరీక్ష రాసేందుకు తీసుకెళ్లనున్నారు. దీంతో పరీక్ష కేంద్రం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు. అయితే నిన్న కిడ్నీప్‌ కు గురై ఇవాల వైశాలి పరీక్ష రాసేందుకు హాజరు కానున్నడంతో సర్వత్రా ఉత్కంఠ మొదలైంది. వైశాలి సేఫ్‌గా పరీక్ష రానుందా? పరీక్ష కేంద్రం వద్ద మళ్లీ నిన్నటి లాగే కిడ్నాప్‌ కథ జరగనుందా? అనేది ప్రజల్లో ఆశక్తిగా మారింది.
Gold and Silver Price: పెళ్లిళ్ల సీజన్‌.. షాకిస్తున్న పసిడి ధరలు..