Medaram Jathara:ములుగు జిల్లా మేడారం మహాజాతరలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పాల్గొన్నారు. ఇవాళ మేడార జాతరకు వెళ్లిన గవర్నర్ సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వనదేవతలకు స్వర్ణం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవర్మార్‌తో పాటు కేంద్ర మంత్రి అర్జున్ ముండా కూడా సమ్మక్క-సారలమ్మ దేవతలను దర్శించుకున్నారు. కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా, గవర్నర్ తమిళిసై శుక్రవారం ఉదయం 11:05 గంటలకు హెలికాప్టర్‌లో మేడారం చేరుకున్నారు. వీరికి మంత్రి సీతక్క, ఈటెల రాజేందర్, జిల్లా కలెక్టర్, త్రిపాఠి ఘనస్వాగతం పలికారు. అనంతరం వనదేవతల దర్శనానికి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ అక్కడ బంగారాన్ని సమర్పించారు.
Read also: Bhimaa Movie: గోపీచంద్ ‘భీమా’ ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఖరారు!
మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఫిబ్రవరి 21న ప్రారంభమైన మేడారం జాతర ఫిబ్రవరి 24న ముగియనుంది. వనదేవతలను దర్శించుకునేందుకు తెలంగాణతోపాటు సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర నుంచి జనం పోటెత్తారు. అమ్మవారు బల్లలపై నిల్చుని ఉండడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు కాసులు కురిపిస్తున్నారు. జంపన్న నదిలో ఎక్కడ చూసినా జన ప్రవాహం కనిపిస్తోంది. భక్తులు జంపన్నవాగులో స్నానాలు చేసి అమ్మవారికి నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తున్నారు.
Kishan Reddy: రామగుండంలో ఎరువుల పరిశ్రమను ప్రారంభించింది మోడీనే..