Site icon NTV Telugu

Kunamneni Sambasiva Rao: తమిళి సై తెలంగాణను వీడాలి.. మోడీ రావొద్దు

Kunamneni Sambasiva Rao

Kunamneni Sambasiva Rao

Kunamneni Sambasiva Rao: తెలంగాణ గవర్నర్ తమిళి సై తెలంగాణ వదిలి వెళ్లిపోవాలని, ప్రధాని మోడీ తెలంగాణకు రావద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రధానికి తెలంగాణ పట్ల అనుకోని ప్రేమ వచ్చిందని ఎద్దేవ చేశారు. 12వ తేదీ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభిస్తున్నారని తెలిసిందన్నారు. దురుద్దేశం తోనే మోడీ పర్యటన అని ఆరోపించారు. ఎన్నికల తరువాత విజయం సాధించి ఈ ఫ్యాక్టరీ ప్రారంబిద్దామని అనుకున్నారు..షెడ్యూల్ కూడా అప్పటిదే.. అని అన్నారు. గత సంవత్సరం ప్రారంభమైన ఫ్యాక్టరీ ఇప్పుడు ప్రారంభించడం ఏంటి..?అని ప్రశ్నించారు. దానిని మేము ఏదో చేశామని మీ ఖాతాలో వేసుకుందాంనుకున్నారా…? అని మండిపడ్డారు. మీకు నైతికత లేదు, మీరు టెక్నీకల్ ప్రధాని మాత్రమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ మీ ప్రభుత్వం లేదు.. ఎమ్మెల్యేలను గుంజుకొని ప్రభుత్వం కూల్చాలనుకుంటున్నారని ఆరోపించారు. 8 సంవత్సరాల్లో తెలంగాణకి మీరు ఏం చేశారు? అని ప్రశ్నించారు. విభజన చట్టంలోని ఏఒక్క హామీ అయిన నెరవేర్చరా? అని అన్నారు. మీ మంత్రి కిషన్ రెడ్డి బయ్యరం స్టార్ట్ కాదని చెప్పారు.

Read also: Karthi 25th film: కార్తీ 25వ చిత్రం ‘జపాన్’ ఆరంభం

సింగరేణి ఫ్రీవేటికరణ చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. మా తెలంగాణ గడ్డ మీద ఉన్న బొగ్గు బావులను ఆధాని అంబానీ కి కేటాయించిన నువ్వు మా గడ్డ మీద అడుగు ఎలా పెడతావ్.. అంటూ మండిపడ్డారు. మా బ్యాంక్ , ఉక్కు కర్మాగారాలు, lic లు ప్రైవేటుకు ఇస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ తెలంగాణ కు రావద్దని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామని హెచ్చారించారు. 10 వ తేదీ నుండి బొగ్గు కర్మాగారంలో ఆందోళన చేస్తామన్నారు. తెలుగు మూలాల గల ముఖ్యమంత్రి తమిళ బాషా మాట్లాడుతున్నారని, నల్లులు, జలగాళ్ల మాట్లాడుతున్నారని గవర్నర్ హెద్దవా చేస్తూ మాట్లాడారని అన్నారు. తెలంగాణలో మంత్రులను నా ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటున్నానని గవర్నర్ అన్నారు. మీరు గవర్నర్ ఆ..బీజేపీ కార్యకర్తనా.. ముందు తేల్చాలని ప్రశ్నించారు. తమిళనాడు, కేరళ, ఢిల్లీ, తెలంగాణలో గవర్నర్ ల తీరు సరిగా లేదని అన్నారు. గవర్నర్ ల వ్యవస్థ సరిగా లేదని, బ్రిటీష్ కాలం నుండి వచ్చిన ఈ గవర్నర్ వ్యవస్థని రద్దు చేయాలన్నారు. మేము మా జాతీయ మహాసభల్లో కూడా తీర్మానం చేస్తామన్నారు. తమిళ్ సై తెలంగాణ వదిలి వెళ్లిపోవాలని త్వరలో పెద్ద ఎత్తున రాజ్ భవన్ ముట్టడి చేస్తామని హెచ్చారించారు.
Governor Tamilisai vs DMK: తమిళిసైని టార్గెట్‌ చేసిన డీఎంకే.. గవర్నర్‌ కౌంటర్‌ ఎటాక్‌

Exit mobile version