NTV Telugu Site icon

Drug Soldiers: డ్రగ్స్ పై ప్రభుత్వం సరికొత్త యుద్ధం.. సోల్జర్స్‌గా ప్రభుత్వ ఉద్యోగులు..

Telangana Drugs

Telangana Drugs

Drug Soldiers: హైదరాబాద్‌లో డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయినా అటు పెడ్లర్లు అంతకంతకూ చెలరేగిపోతూ గుట్టు చప్పుడు కాకుండా.. డ్రగ్స్ క్రయ విక్రయాలు చేస్తున్నారు. యువత, విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ విక్రయిస్తున్నారు. డ్రగ్స్ పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. రాష్ట్రంలో డ్రగ్స్ పై పోరాటం చేస్తున్న ప్రభుత్వం తాజాగా కొత్త నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులను డ్రగ్ సోల్జర్స్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, రెవెన్యూ అధికారులు, సైనికులు, పారామెడికల్ సిబ్బంది, వైద్యులు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీలను కమిటీలుగా నియమించారు. డ్రగ్స్ సైనికులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. కాగా.. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు రేవంత్ సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పోలీసులు అక్రమార్కులను పట్టుకుని కటకటాల వెనక్కి పంపుతున్నారు. వారాంతాల్లో కూడా పబ్బులు, ఇతర ప్రైవేట్ పార్టీలపై దాడులు చేసి డ్రగ్స్ విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. అలాగే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. గంజాయి రవాణాపై కూడా పోలీసులు దృష్టి సారించారు. వాహనం వదలకుండా తనిఖీలు నిర్వహిస్తూ… కేజీల కొద్దీ డ్రగ్స్ పట్టుకుంటున్నారు. డ్రగ్స్ క్రయ, విక్రయాలపై నగర పోలీసులు దృష్టి పెట్టారు. కాలేజీలు, హాస్టల్లపై కూడా దాడులు చేపట్టారు.
Fastest Journey On Foot: 3,800 కిలోమీటర్లకు పైగా పరిగెత్తి ప్రపంచ రికార్డు సృష్టించిన వ్యక్తి