NTV Telugu Site icon

Telangana: గూప్స్‌ పోస్టుల వర్గీకరణ, పరీక్షా విధానం ప్రకటన..

students

students

తెలంగాణలో గ్రూప్‌1, గ్రూప్‌2, గ్రూప్‌3, గ్రూప్‌4 పోస్టుల వర్గీకరణ, పరీక్షా విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. గ్రూప్-1లో 19 రకాల పోస్టులు, గ్రూప్-2లో 16 రకాల పోస్టులు ఉంటాయని తెలిపింది. గ్రూప్-1 పోస్టులకు 900 మార్కులతో… గ్రూప్-2 పోస్టులకు 600 మార్కులతో పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించింది. ఇక గ్రూప్-3లో 8 రకాల పోస్టులకు 450 మార్కులతో పరీక్ష నిర్వహించనున్నారు. గ్రూప్-4లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు ఉండనున్నాయి. గ్రూప్-4లో 300 మార్కులతో పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్ధూ భాషల్లో నియామక పరీక్షలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు టీచర్ల ప్రమోషన్‌కి మరో అడ్డంకి తొలగిపోయింది. పండిట్, పీఈటీ పోస్టుల అప్‌గ్రేడేషన్‌పై కోర్టుకెక్కిన ఎస్జీటీలు…
కేసును ఉపసంహరించుకునేందుకు అంగీకారం తెలిపారు. పీఈటీ పోస్టులకు అర్హులైన వారికి న్యాయం చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. ఇక, త్వరలోనే రాష్ట్రంలో మరిన్ని ఉద్యోగల భర్తీకి నోటిఫికేష్లు వస్తాయని మంత్రులు చెబుతున్న విషయం తెలిసిందే.

Read Also: AP COVID 19: ఏపీలో కరోనా కేసులు నిల్.. ఇదే తొలిసారి..