MLA Raja Singh: డీజీపీ అంజనీ కుమార్ కి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. తనకు 8 నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని లేఖలో పేర్కొన్నారు రాజాసింగ్.. ఆ కాల్స్ ఎక్కడి నుంచో కాదు పాకిస్తాన్ నుండి వస్తున్నాయని లేఖలో తెలిపారు. ఇప్పుడే కాదు అంతకు ముందు చెప్పిన ఇప్పటి వరకు FIR నమోదు చేయలేదని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. చాలా సార్లు పోలీసులకు చెప్పిన స్పందించడం లేదని లేఖలో పేర్కొన్నారు. తనకు ప్రాణహాని ఉందని లైసెన్స్ గన్ ఇవ్వాలని డీజీపీని కోరారు రాజాసింగ్.
Read also: Chittoor Crime: బెదిరించాలని అనుకున్నాడు.. తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడు..
అయితే తనకు గన్ ఇచ్చేందుకు రాజాసింగ్ పై కేసులు ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై రాజా సింగ్ ఫైర్ అయ్యారు. కొందరిపై కేసులున్న ఎవ్వరికీ లైసెన్స్ ఇవ్వలేదా? అంటూ ప్రశ్నించారు. తనకు ప్రాణాహాని ఉందని చెబుతున్న పోలీసులు ఎందుకు స్పందిచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి రెండు సార్లు పోలీసులకు తెలిపిన కేసు నమోదు చేయలేదని, ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి తనే 8 నెంబర్లు నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని లేఖలో స్పష్టంగా వున్నాయని ఇప్పుడైనా వారిని గుర్తించి, బెదిరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అసలు పాకిస్తాన్ నుంచి తనకు ఎందుకు కాల్స్ వస్తున్నాయని ఆరా తీయాలని లేకలో రాజాసింగ్ పేర్కొన్నారు.
Bhatti Vikramarka: కొనసాగుతున్న భట్టి విక్రమార్క పాదయాత్ర.. పాల్గొననున్న ఎమ్మెల్యే సీతక్క