Site icon NTV Telugu

తెలంగాణలో తగ్గనున్న బీర్ల ధరలు !

గతేడాది లాక్‌ డౌన్‌ కారణంగా మన దేశంలోని అన్ని రాష్ట్రాల ఆదాయాలు పడిపోయిన సంగతి తెలిసిందే. లాక్‌ డౌన్‌ కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోవడం, ఎన్నో వ్యాపారాలు దెబ్బతినడం మనం చూశాం. దీంతో ప్రభుత్వాల ఖజానాకు కూడా గండి పడింది. అయితే… ఈ నేపథ్యంలో గతేడాది తెలంగాణ సర్కార్‌ మద్యం ధరలను భారీ ఎత్తున పెంచేసింది. దీంతో లాక్‌ డౌన్‌ కారణంగా నష్టపోయిన రెవెన్యూను తిరిగి రాబట్ట గలిగింది. అటు మందు బాబులు కూడా ధరలపై ఏ మాత్రం దృష్టి పెట్టకుండా.. తమకు కిక్కెక్కుతే చాలన్న ధోరణితో కొనేస్తున్నారు.

read also : మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత

ఇది ఇలా ఉండగా.. గతంలో పోలిస్తే.. మద్యం సీసాల అమ్మకాలు బాగా తగ్గాయని సమాచారం. గతంతో పోలిస్తే… ధరలు పెరిగిన అనంతరం అమ్మకాలు భారీగా పడిపోయాయట. ముఖ్యంగా బీర్ల అమ్మకాలు విపరీతంగా పడిపోయాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. దీంతో షాక్‌ కు గురైన కేసీఆర్‌ సర్కార్‌.. ఈ విషయంలో సరికొత్త నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోందట. బీర్ల ధరలపై రూ. 10 తగ్గించాలని ఆలోచనలో పడిందట. దీనిలో భాగంగానే డిస్టిల్లరీలో ఉత్పత్తి చేసే నూతన స్టాకుపై ఈ కొత్త ధరలు అమలు చేయాలని చూస్తుందట. ఈ మేరకు నేడు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేయనుందని సమాచారం.

Exit mobile version