తెలంగాణ రైతులకు శుభవార్త… ఇవాళ్టి నుంచే రుణమాఫీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే పంట రుణాల మాఫీ ప్రక్రియకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విడతల వారిగా రైతు రుణమాఫీ చేస్తోన్న సర్కార్.. ఇవాళ్టి నుంచి 50 వేలలోపు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేయనుంది. ఇప్పటికే మొదటి విడతలో 25 వేల లోపు రుణం తీసుకున్న 3 లక్షల మంది అన్నదాతలకు రుణమాఫీ చేసింది. ఈసారి ఏకంగా 6 లక్షల మందికిపైగా రైతులకు లబ్ది చేకూరనుంది. స్వాంత్రంత్ర వేడుకల్లో దీనిపై మరోసారి ప్రకటన చేశారు సీఎం కేసీఆర్. తెలంగాణలో రైతు రుణమాఫీ కోసం 2 వేల5 కోట్ల 85 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది ప్రభత్వం.
50 వేల వరకు రుణాలున్న 6 లక్షల 6 వేల 811 మంది రైతులకు లబ్ది చేకూరనుంది. దీనికి సంబంధించి ట్రయల్ రన్ నిర్వహించారు అధికారులు. 25 వేల 100 వరకు రుణం ఉన్న రైతుల రుణమాఫీపై ట్రయల్ రన్ పూర్తయింది. ఈనెల 30 వరకు 25 వేల నుంచి 50 వేల వరకు రుణాలున్న రైతులకు రుణాలు మాఫీ చేయనుంది ప్రభుత్వం.
Also Read
రైతుబంధులా గుంట భూమి నుంచి ఎకరా వరకు, ఎకరా నుంచి 2 ఎకరాలు, 2 నుంచి 3 ఎకరాల రైతుల ఖాతాలలో నిధులు జమ చేసినట్లుగానే.. 25, 26, 27 వేల చొప్పున రుణాలు మాఫీ అవుతాయి. ఈ మేరకు రైతుల ఖాతాలలో నిధులు జమ చేస్తుంది ప్రభుత్వం. రైతుబంధు తరహాలోనే వందశాతం విజయవంతంగా పంట రుణాలు మాఫీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆన్లైన్ ద్వారా అమలు చేసేందుకు ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించింది. 2014 నుంచి 2018 వరకు మొత్తం 16 వేల 144 కోట్లు ఖర్చు చేసింది ప్రభుత్వం.
తాజావార్తలు
-
Parliament Special Sessions: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ప్లాన్?.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై కసరత్తు
-
IPL 2027: ఢిల్లీ క్యాపిటల్స్కు బిగ్ షాక్.. ఐపీఎల్ 2027 ముందే స్టార్ ప్లేయర్ అవుట్.. ఇక కష్టమే!
-
How to Store Fashion Jewellery: మీ ఫ్యాషన్ జ్యువెలరీ నల్లగా మారుతున్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
-
Municipal Elections 2026: నేటి నుంచే మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు.. మూడు రోజులే గడువు!
-
Movies Sequel Trend: సినిమాల్లో సీక్వెల్స్ శకం.. రెండు భాగాలతో ఆగని కథలు.! పార్ట్ 3, పార్ట్ 4 లంటూ మాస్టర్ ప్లాన్..
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!