NTV Telugu Site icon

ఉద్యోగుల‌కు గుడ్‌న్యూస్.. పీఆర్సీ ఉత్త‌ర్వులు జారీ

TS Government

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభ‌వార్త చెప్పింది ప్ర‌భుత్వం.. ఇప్ప‌టికే కొత్త వేతన సవరణ అమలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెల‌ప‌గా.. ఇవాళ ఉత్త‌ర్వులు జారీ చేసింది స‌ర్కార్.. పెంచిన పీఆర్సీని జూన్ నెల నుంచి అమలు చేసి.. వేతనాలు చెల్లించాల‌ని నిర్ణ‌యించారు.. నోషనల్ బెనిఫిట్​ను 2018 జులై ఒకటి నుంచి, మానిటరీ బెనిఫిట్​ను 2020 ఏప్రిల్ ఒకటి నుంచి, క్యాష్ బెనిఫిట్​ను 2021 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని ఇప్ప‌టికే కేబినె‌ట్ నిర్ణ‌యించ‌గా.. కాసేప‌టి క్రిత‌మే ఉత్త‌ర్వులు వెలువ‌డ్డాయి.. ఇక‌, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 30 శాతం పీఆర్సీ వర్తింప జేస్తున్న‌ట్టు ఉత్త‌ర్వుల్లో పేర్కొంది స‌ర్కార్.. పెన్షనర్ల మెడికల్ అలవెన్సు 350 నుంచి 600కు పెంచిన ప్ర‌భుత్వం.. రిటైర్మెంట్ గ్రాట్యుటీ 12 లక్షల నుండి 16 లక్షలకు పెంచింది.. ఇక‌, 15 శాతం పెన్షన్ పెంపు 75 సంవత్సరాల నుండి 70 ఏళ్లకు త‌గ్గించింది. ఉద్యోగుల కనీస వేతనం రూ. 19 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 32 గ్రేడ్లు, 80 సెగ్మెంట్లను కొనసాగించింది. 2018 జులై వరకు ఉన్న డీఏ 30.39 శాతం మూలవేతనంలో కలవనున్నది.