Bhadradri: ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో స్వామివారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఏప్రిల్ 17న సీతారాముల కల్యాణం, 18న స్వామివారి పట్టాభిషేకానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా.. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం సీతారాముల కల్యాణ శ్రీరామనవమి. తలంబ్రాలకు చాలా ప్రత్యేకం. వీటిని ముత్యాలు అంటారు. వివాహానంతరం ఈ తలంబ్రాలను సేకరిస్తే స్వామివారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే ఈ ముత్యాల తలంబ్రాలను సేకరించేందుకు దేశం నలుమూలల నుంచి రామభక్తులు ఆసక్తి చూపుతున్నారు.
Read also: Asaduddin Owaisi: తెలంగాణలో ఏ పార్టీలతోనూ ఎలాంటి పొత్తు లేదు.. తేల్చేసిన ఒవైసీ
అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల నుంచి ఈ ముత్యాల తలంబ్రాలు సర్దుకునేందుకు వస్తున్న మహిళలతో కోలాహలంగా మారింది. మహిళలు నిత్యం 10 నుంచి 15 వేల ముత్యాల ప్యాకెట్లను సిద్ధం చేసి రామభక్తికి అంకితం చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు మాట్లాడుతూ.. శ్రీరామనవమి నాడు భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణాన్ని దర్శించిన భక్తులకు పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. స్వామివారి కల్యాణంలో వినియోగించే తలంబ్రాలను పొందేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు. స్వామి, అమ్మవారి నుదుటిపై తలంబ్రాలు చల్లితే ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు లభిస్తాయని వారి విశ్వాసం. అలాంటి తలంబ్రాలను పొందేందుకు భక్తుల రద్దీ ఏటా పెరుగుతోంది.
Stone Attack on CM Jagan: సీఎం జగన్‌పై దాడి ఘటనపై పోలీసుల విచారణ ముమ్మరం