టెక్నాలజీ వచ్చాక అన్నీ మారిపోతున్నాయి. గతంలో బ్యాంకులకు వెళ్లి క్యూలో నిలబడి.. డబ్బులు విత్ డ్రా చేసుకునేవాళ్ళం. కానీ ఏటీఎంలు వచ్చాక చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు మాత్రం డిజిటల్ మనీ వచ్చాక డబ్బులు తీసుకోవడం, ఎవరికైనా పంపించడం చాలా తేలికైంది. దీపావళి ధమాకా వచ్చిందా అన్నట్టుగా సిద్ధిపేటలో ఏటీఎంకి వెళ్లిన వారి పంట పండింది. ఆ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసిన వినియోగదారులకు బంపర్ ఆఫర్ వచ్చిపడింది. వినియోగదారులు వెయ్యి రూపాయలు డ్రా చేస్తే 2000 రూపాయలు వచ్చాయి.
ఇంతకీ ఈ ఏటీఎం ఎక్కడ ఉందంటే సిద్దిపేట పట్టణంలోని కమాన్ రోడ్ లోని బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం. వివరాలలోకి వెళితే సిద్దిపేట పట్టణంలోని కమాన్ రోడ్ లో గల బిఓఐ బ్యాంక్ ఏటిఎం లో మంగళవారం సాంకేతిక సమస్య మూలంగా వినియోగదారులు డ్రా చేసిన డబ్బుల కంటే అధికంగా వచ్చాయి .వినియోగదారుడు వెయ్యి డ్రా చేస్తే రెండు వేలు వచ్చాయి. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పట్టణంలో తెలియడంతో పలువురు ఆ ఏటీఎం వద్దకు వెళ్ళి డబ్బులు డ్రా చేసుకున్నారు. విషయం తెలుసుకున్న బ్యాంక్ అధికారులు ఏటీఎం వద్దకు వచ్చి సాంకేతిక సమస్యను సరిదిద్దే పనిలో పడ్డారు. కొందరు ఎక్కువగా వచ్చిన డబ్బుల్ని బ్యాంకు అధికారులకు ఇచ్చేశారు. మరికొందరేమే భలే మంచి చౌక బేరము.. అంటూ పట్టుకెళ్లారు.
Read Also: BiggBoss 6: ఛీఛీ దారుణం.. రేవంత్ ను కాలుతో తన్నిన గీతూ
ఇదో రకం విచిత్రం అయితే.. సంగారెడ్డిలోని కంది గ్రామంలో రెండు ATM లలో డబ్బుల గోల్ మాల్ బయటపడింది. లెక్క తేలని దాదాపు 30 లక్షల రూపాయలు వెలుగులోకి వచ్చాయి. ATM లలో క్యాష్ డిపాజిట్ చేసే అప్ లోడర్స్ పైనే అనుమానం వ్యక్తం చేస్తుంది ఏజెన్సీ. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఏజెన్సీ సభ్యులు. ATM లో డబ్బులు డిపాజిట్ చేసేటప్పుడు OTP వచ్చింది..కానీ తీసేటప్పుడు OTP రాలేదని చెబుతుంది ఏజెన్సీ. ఈ గోల్ మాల్ వెనుక ఏజెన్సీ సభ్యుల హస్తం కూడా ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ కేసును గోప్యంగా ఉంచుతున్నారు పోలీసులు.
Read ALso: Bandi Sanjay: బండి సంజయ్ కౌంటర్ ఎటాక్.. కేసీఆర్ ఝూఠా మాటల పోస్టర్లు విడుదల