విమానాశ్రయాలు పేరు చెబితే బంగారం విచ్చలవిడిగా దొరుకుతోంది. ప్రయాణికులు ఏదో విధంగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారు. కొత్తదారులు వెతుక్కుంటూ మరీ అడ్డదారులు తొక్కుతున్నారు. ఎన్ని ఎత్తుగడలు వేసినా.. కస్టమ్స్ అధికారుల ముందు కేటుగాళ్ళ ఆటలు సాగడం లేదు. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి వచ్చిన ప్రయాణికుని వద్ద బంగారం సీజ్ చేశారు. ప్రయాణికుని వద్ద 957 గ్రాముల బంగారం దొరికింది. పట్టుకున్న బంగారం విలువ 46 లక్షల 53 వేలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.
ఇంతకీ ఎయిర్ పోర్టులో బంగారం ఎక్కడ దాచాడో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవకమానదు. కస్టమ్స్ అధికారులకు నిందితుడు కాళ్లకు బంగారం అతికించుకుని వచ్చాడు. కాళ్లకు కట్టు కట్టుకున్నట్టుగా అతను బంగారం దాచుకుని రావడం కస్టమ్స్ అధికారులను బురిడీ కొట్టించాలని చూశాడు. కానీ కస్టమ్స్ అధికారులు మాత్రం అతడి ఆటలు సాగనివ్వలేదు. అన్నీ చెక్ చూసి అతని గుట్టు రట్టుచేశారు. ఈమధ్యకాలంలో ఎయిర్ పోర్టులు అక్రమ బంగారానికి అడ్డాలుగా మారాయి.
దాదాపు రెండునెలల క్రితం భారీగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఓ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు కస్టమ్స్ అధికారులు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడు పెద్ద ఎత్తున గోల్డ్ అక్రమంగా హైదరాబాద్ కు తెచ్చారు. దీంతో ఎయిర్ పోర్ట్ లో వారి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. వారి వద్ద దాదాపుగా 5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విధంగా కిలోల కొద్దీ బంగారం పట్టుబడుతోంది. బహిరంగ మార్కెట్లో బంగారం రేటు పెరగడంతో విదేశాల నుంచి అక్రమమార్గంలో బంగారం తరలించి.. అడ్డంగా దొరికిపోతున్నారు.
Read Also: Missing Child Case: బాలిక మిస్సింగ్ విషాదాంతం.. చెరువులో మృతదేహం
