Site icon NTV Telugu

టిమ్స్ ఆస్పత్రిలో దారుణం.. మృతదేహాలే ఆ దంపతుల టార్గెట్..!

TIMS

TIMS

కరోనా మహమ్మారి ప్రపంచాన్నే వణికించింది… ఎన్నో కుటుంబాలను పొట్టనబెట్టుకుంది.. అయితే, కరోనాతో కన్నుమూశారంటే.. వారిని చూసేందుకు వచ్చేవారు కూడా లేకుండా పోయారు.. ఇదే ఆ దంపతులకు కలిసి వచ్చింది.. గచ్చిబౌలిలోని టిమ్స్‌ ఆస్పత్రిలో దారుణమైన ఘటన వెలుగు చూసింది.. కరోనా సమయంలో మృతదేహాల పైనుంచి నగలు మాయం చేశారు దంపతులు.. ఇప్పటి వరకు ఏడు మృతదేహాల నుంచి నగలను కొట్టేసినట్టు గుర్తించారు.. టిమ్స్‌ ఆస్పత్రిలో ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిగా పని చేస్తున్న దంపతులు.. కరోనాతో మృతిచెందినవారి నగలను కొట్టేయడం.. ఆ తర్వాత కుదిరితే అమ్మేయడం, లేకపోతే తాకట్టు పెట్టడమే పనిగా పెట్టుకున్నారు.. అ వ్యవహారంలో పోలీసులకు ఫిర్యాదు అందడంతో.. కూకట్‌పల్లి చెందిన చింతపల్లి రాజు అరెస్టు చేశారు గచ్చిబౌలి పోలీసులు.. కరోనా సమయంలో కారు ఈఎంఐ కట్టేందుకు రాజు, లతశ్రీ దంపతులు ఈ పనికి పూనుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు.. ఇక, దంపతుల దగ్గర్నుంచి చోరీ చేసిన సొత్తును రికవరీ చేశారు పోలీసులు.

Exit mobile version