Site icon NTV Telugu

Talasani Srinivas Yadav: గోల్కోండలో మంత్రి పర్యటన.. బోనాల ఏర్పాట్లపై సమీక్ష

Talasani Srivas Yadav

Talasani Srivas Yadav

ఈ నెల 30 నుంచి గోల్కొండ బోనాలు ప్రారంభం అవుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. ఈ నేపథ్యంలోనే గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై గోల్కొండ కోట వద్ద సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా గుర్తింపు లభించిందన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామన్నాని ఆయన గుర్తు చేశారు. బోనాల సందర్భంగా జగదాంబ మహంకాళి అమ్మావారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాల సమర్పిస్తామన్నారు. బోనాల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.15 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. బోనాల సందర్భంగా వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

తెలంగాణ సంసృతిని చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలకు గ్రేటర్‌ సన్నద్ధమవుతున్నది. ఈ మేరకు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రూ.15కోట్లను మంజూరు చేసిన ప్రభుత్వం, ఉత్సవాల తేదీలను కూడా ప్రకటించింది. రాష్ట్రంలో గోల్కొండ బోనాలతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 28వరకు బోనాల ఉత్సవాలు జరుగనున్నాయి. 30న గోలొండ బోనాలు, జూలై 17న సికింద్రాబాద్‌, 24వ తేదీన హైదరాబాద్‌ బోనాలు, 28న గోల్కొండ బోనాలతో ముగించనున్నారు.

కాగా.. సుమారు 26 దేవాలయాలలో ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అదేవిధంగా అమ్మవారి ఊరేగింపు కోసం ప్రభుత్వం అంబారీలను ఏర్పాటు చేసి ప్రభుత్వమే పూర్తి ఖర్చులను భరించనుంది.భక్తుల సౌకర్యార్థం పలు ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్రీన్లు, త్రీడీ మ్యాపింగ్‌లు ఏర్పాటు, పలు ఆలయాల వద్ద ప్రత్యేకంగా స్టేజీలు ఏర్పాటు చేసి సాంసృతిక శాఖ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తులు తోపులాటకు గురికాకుండా పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో బోనాల ఉత్సవాలు జరిగేలా భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా శాంతి భద్రతలను పర్యవేక్షించనున్నారు.

Somireddy Chandramohan: రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య పేరు ప్రకటించాలి

Exit mobile version