మళ్ళీ గోదావరి వరద ప్రవాహం పెరుగుతుంది. కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన వరద మళ్ళీ పెరుగుతుండటంతో ముంపు గ్రామాల నిర్వాసితుల్లో ఆందోళన నెలకొంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు కారణంగా గోదావరి వరద ఉగ్రరూపం దాల్చుతోంది. నిన్న (శుక్రవారం) ఉదయం నుంచి రాత్రి వరకు భాగ్యనగరంతో సహా పలు జిల్లాల్లో భారీగా వానలు పడ్డాయి. నగరవాసులతంగా ఇంకా ఐదురోజుల పాటు అప్రమత్తంగా వుండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్రేటర్ నగరంతో పాటు మహబూబ్ నగర్, జనగామ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఉంటుందని ప్రకటించింది. కాగా.. 4 రోజులు అక్కడక్కడా కుంభవృష్టి కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఈనేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకపోవడం మంచిదని సూచించారు. మరోవైపు రాష్ట్రంలో వానలు విజృంభించడంతో వాగులు, వంకలు ఉప్పొంగాయి.
గత 24 గంటల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల మళ్లీ గోదావరి పెరుగుతుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 45 అడుగుల వరకు చేరుకుంది. నిన్న భారీ ఎత్తున వచ్చిన వర్షాలతో గోదావరి మళ్లీ వరద చేరుకోండి. నిన్న ఉదయం 42 అడుగులు ఉన్న గోదావరి ఈరోజు తెల్లవారుజాము వరకు చేరుతుంది. నిన్న 42 అడుగుల వరకు గోదావరి చేరు కున్నప్పటికీ ఇప్పటివరకు మొదటి ప్రమాద హెచ్చరికని తొలగించలేదు. గోదావరి పరివాహక ప్రాంతంలో వరదలు వర్షాలు వల్ల ఇంకా మూడవ ప్రమాద హెచ్చరికనే కొనసాగిస్తున్నారు. గతవారం భద్రాచల వద్ద గోదావరి 71.3 అడుగులకి చేరుకుంది .గోదావరి ప్రమాదకరంగా రావడంతో కింద ఉన్న ప్రజల్ని అలర్ట్ గా ఉండాలని ఇంకా అధికారులు చెబుతున్నారు. దిగువన ధవలేశ్వరం ఎగువన పేరూరు వద్ద ప్రమాద హెచ్చరికల్ని తొలగిస్తున్నప్పటికీ భద్రాచలం వద్ద మాత్రం అధికారులు ప్రమాద హెచ్చరికల్ని తొలగించటం లేదు. ప్రధానంగా భద్రాచలంకి పొంచి ఉన్న ప్రమాదమే దానికి కారణమని చెప్తున్నారు .మరో మూడు అడుగుల వరకు గోదావరి పెరిగి మళ్లీ తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.
