Site icon NTV Telugu

GO 317 Employees: తీవ్ర మానసిక ఆందోళనలో ఉద్యోగులు

ts govt

ts govt

తెలంగాణ ప్రభుత్వం తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పరస్పరం బదిలీలకు అప్లై చేసుకున్న ఉద్యోగులు. తీవ్ర మానసిక ఆందోళనలో తమకు న్యాయం చేయాలని వారు సీఎం కేసీఆర్‌ని వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఆగమేఘాల మీద 317 జీవో ను తీసుకువచ్చి 2022 జనవరి 6న రాత్రికి రాత్రే మాది కాని జిల్లాలో మమ్ములను పంపించిందన్నారు. ఒక్క రోజు కూడా సమయం ఇవ్వలేదు. మా తల్లిదండ్రులకు భార్య పిల్లలకు దూరం చేసింది. సొంత జిల్లాలను కోల్పోయిన ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

అటువంటి సమయంలో మాకు పరస్పర బదిలీలు జీవో నెంబర్ 21 మరియు జీవో నెంబర్ 402 ద్వారా అవకాశం కల్పించి కొంత ఉపశమనం కలిగించి 2022 మార్చి 1 నుండి ఏప్రిల్ 1 వరకు అవకాశం ఇచ్చింది. కానీ ప్రభుత్వం పరస్పర బదిలీలు త్వరితగతిన జరిగేందుకు ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల తీవ్ర మానసిక ఆందోళనలో 10 వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దృష్టికి తీసుకువెళ్లి తొందరగా పరస్పర బదిలీలు చేపట్టి ప్రమోషన్లు ఇప్పించగలరని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామని ఒక ప్రకటనలో కోరారు ఉద్యోగులు.

Akkineni Nagarjuna: నాగార్జునకు ఏమైంది.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో

Exit mobile version