Site icon NTV Telugu

GO 252 : ఒకే వృత్తి.. రెండు కార్డులా.? జీవో 252పై జర్నలిస్టుల సమరభేరి

Djft

Djft

GO 252 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన అక్రిడిటేషన్ల జీవో నెంబర్ 252పై జర్నలిస్టు లోకం భగ్గుమంది. ఈ జీవోలో ఉన్న అసంబద్ధ నిబంధనలను సవరించాలని, డెస్క్ జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ శనివారం రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో జర్నలిస్టు సంఘాలు భారీ నిరసనలు చేపట్టాయి. ముఖ్యంగా డెస్క్ జర్నలిస్టులు, చిన్న పత్రికల ప్రతినిధులు ఈ ఆందోళనల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అక్రిడిటేషన్ వర్సెస్ మీడియా కార్డు: వివాదం ఏంటి?
ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన విధానం ప్రకారం.. ఫీల్డ్ రిపోర్టర్లకు ‘అక్రిడిటేషన్ కార్డు’, డెస్క్ జర్నలిస్టులకు కేవలం ‘మీడియా కార్డు’ జారీ చేయాలని నిర్ణయించింది. దీనిపై జర్నలిస్టు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

ఒకే వృత్తిలో ఉన్న వారిని రిపోర్టర్లు, డెస్క్ అని రెండు వర్గాలుగా విభజించడం జర్నలిస్టుల మధ్య విభేదాలు సృష్టించడమేనని వారు మండిపడుతున్నారు. మీడియా కార్డు వల్ల రైల్వే, బస్సు పాస్ రాయితీలు, టోల్ గేట్ మినహాయింపులు వంటి కనీస ప్రయోజనాలు కూడా అందే అవకాశం లేదని డెస్క్ జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉన్నట్లుగానే డెస్క్ జర్నలిస్టులకు కూడా పూర్తిస్థాయి అక్రిడిటేషన్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా డెస్క్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ నేతృత్వంలో హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ ల ముందు డెస్క్ జర్నలిస్టులు జీవో 252పై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా DJFT నాయకులు మాట్లాడుతూ.. కొత్త జీవో వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 వేల మంది జర్నలిస్టులు అక్రిడిటేషన్లు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ప్రధాన డిమాండ్లు:

జర్నలిస్టు సంఘాలైన టీడబ్ల్యూజేఎఫ్ (TWJF), డీజేఎఫ్ టీ (DJFT), టీయూడబ్ల్యూజే (TUWJ 143), హెచ్ యూజే వంటి సంస్థలు ఐక్యంగా ఈ పోరాటాన్ని సాగిస్తున్నాయి. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోతే, రాజధాని హైదరాబాద్‌లో ‘మహా ధర్నా’ చేపడతామని, రాష్ట్రవ్యాప్త దీర్ఘకాలిక ఆందోళనలకు వెనకాడబోమని జర్నలిస్టు నాయకులు హెచ్చరించారు.

 

 

Exit mobile version