Tummala Ramadevi: తుమ్మల రమాదేవి గారికి గీతం డాక్టరేట్ ప్రదానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ న్యూస్ ఛానెల్ ఎన్టీవీ మీడియా రంగంలో అప్రతిహతంగా దూసుకుపోతోంది. ఎన్టీవీకి చెందిన రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్టీవీ, వనితటీవీ, భక్తి టీవీ) డైరెక్టర్ తుమ్మల (చండ్ర) రమాదేవికి గీతం విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది. ప్రొఫెసర్ ఎస్.ఎస్.ప్రసాదరావు పర్యవేక్షణలో “వర్క్ లైఫ్ బ్యాలన్స్ ఆఫ్ ఉమెన్ ఇన్ 24/7 వర్కింగ్ ఎన్విరాన్ మెంట్ – ఏ స్టడీ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు సెలెక్ట్ ఆర్గనైజేషన్స్ ఇన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ “అనే అంశంపై ఆమె పరిశోధన చేశారు.
తుమ్మల రమాదేవి తన పరిశోధనలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లోని 24/7 విధానంలో పనిచేస్తోన్న వివిధ రంగాలకు చెందిన ఎంపిక చేసిన సంస్థలలో మహిళల వర్క్ లైఫ్ బ్యాలన్స్ ను విశ్లేషించారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఉద్యోగ సంతృప్తి, రోల్ స్ట్రెస్ మరియు ఫ్యామిలీ సపోర్టుకు సంబంధించి డెమోగ్రాఫిక్స్ పాత్రను పరిశీలించారు.
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
2009లో భారతదేశంలో మహిళల కోసం ప్రత్యేకించిన తొలి టెలివిజన్ గా వనిత టీవీ ప్రారంభించారు తుమ్మల రమాదేవి. ఈ ఛానెల్ నిర్వహణ బాధ్యతలు పూర్తిగా రమాదేవి వహించారు. వనిత ఛానెల్ కార్యక్రమాలు పలు టీవీ నంది, యునిసెఫ్, లాడ్లీ మీడియా పురస్కారాలు వంటి అవార్డులు సాధించాయి. లాభనష్టాలతో పనిలేకుండా మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది వనిత టీవీ. ఈ బాధ్యతల్ని తుమ్మల రమాదేవి సమర్థంగా నిర్వహిస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. తుమ్మల రమాదేవి డబుల్ ఎం.ఎ., ఎల్.ఎల్.బి., ఎం.బి.ఎ చదివారు. తాజాగా డాక్టరేట్ రావడంతో డాక్టర్ తుమ్మల రమాదేవిగా మారారు. తుమ్మల రమాదేవి గారికి డాక్టరేట్ రావడం పట్ల రచన టెలివిజన్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!