Site icon NTV Telugu

Gift A Smile Challenge as a KTR Birthday: ఈనెల 24న కేటీఆర్‌ పుట్టినరోజు.. నగరంలో వెలసిన భారీ ప్లేక్సీలు

Gift Smile Challenge As A Ktr Birthday

Gift Smile Challenge As A Ktr Birthday

జూలై 24న కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా నగరంలో భారీ ప్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. మంత్రి పై పార్టీ శ్రేణులు తమ అభిమానాన్ని చాటుకునేందుకు పుట్టిన రోజును వినూత్నంగా నిర్వహించేందుకు సన్నాహాలు రెండురోజుల ముందునుంచే మొదలపెట్టారు. టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు పుట్టిన రోజు వేడుకను ఒక సామాజిక సేవా కార్యక్రమంగా నిర్వహించేందుకు ఆయన అభిమానులు శ్రీకారం చుట్టారు. అయితే.. గిప్ఏస్మైల్‌​ ఛాలెంజ్​ పేరుతో సేవా కార్యక్రమం మొదలెట్టారు.

ఈనెల 24న పుట్టినరోజు జరుపుకోనున్న టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదిన వేడుకలను వినూత్న సామాజిక కార్యక్రమంగా నిర్వహించేందుకు ఆయన అభిమానులు శ్రీకారం చుట్టారు. కాగా.. ప్రకటనలు, బొకేల రూపంలో నగదును వృథా చేయకుండా ఆ డబ్బును సేవకు ఉపయోగించాలనే లక్ష్యంతో ట్విట్టర్​ వేదికగా గిప్ఏస్మైల్‌​​ ఛాలెంజ్​ పేరుతో ఓ వినూత్న కార్యక్రమం చేపట్టారు. తాము సాయం చేసి మరికొందరిని నామినేట్​ చేయగా వారు ఛాలెంజ్​ స్వీకరించి భాగస్వాములవుతున్నారు. ఈనేపథ్యంలో.. ట్రెండింగ్​లో గిప్ఏస్మైల్‌​ ఇప్పటికే ఎమ్మెల్సీ నవీన్‌ కుమార్​ ఈ సవాల్​ స్వీకరించి ఓ స్వచ్ఛంద సంస్థకు అంబులెన్స్​ కోసం పది లక్షల రూపాయలు విరాళం ఇవ్వగా.. శశి కనపర్తి అనే ఎన్​ఆర్​ఐ నిశాంత్​ కేన్సర్​ ఫౌండేషన్​కు 500 డాలర్లు విరాళం ఇచ్చారు. కాగా.. ప్రస్తుతం ట్విట్టర్​లో గిఫ్ట్​ స్మైల్​ ఛాలెంజ్​ ట్రెండింగ్​లో ఉంది. ఈనేపథ్యంలో.. ఆపదలో ఉన్నామన్న వారిని తక్షణమే ఆదుకునే కేటీఆర్‌ ను స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమం ప్రారంభించామని ఆయన అభిమానులు చెబుతున్నారు. అంతేకాకుండా.. దివ్యాంగులకు అవయవాలు సమకూర్చడం, రక్తదాన కార్యక్రమాలు, అనాథ, వృద్ధాశ్రమాల్లో భోజన పంపిణీ, ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల్లో రక్షిత మంచినీటి ప్లాంట్లు వంటి సేవా కార్యక్రమాలు చేయాలని కేటీఆర్ సన్నిహితులు ఛాలెంజ్ విసురుతున్నారు. అయితే ఈ ప్రచారంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు కూడా భాగస్వామ్యులవుతున్నాయి.

Police Command Control Centre: దుబాయ్‌కి బుర్జ్ ఖలీఫా.. హైదరాబాద్‌కి కమాండ్ కంట్రోల్ సెంటర్

Exit mobile version