గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ ప్రత్యేక సమావేశం, సాధారణ సర్వ సభ్య సమావేశం మంగళవారం ఉదయం 10 .30 గంటలకు వర్చ్యువల్ గా జరుగుతుందని జీహెచ్ఎంసీ తెలిపింది. కోవిడ్ నియమ, నిబంధనల నేపథ్యంలో మొదటి సారిగా నిర్వహిస్తున్న ఈ సమావేశం వర్చ్యువల్ గా నిర్వహించేందుకు సభ్యులందరికి ఐ.డి లను పంపించారు. రేపు జరిగే ఈ సమావేశంలో మొదటగా నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి ప్రసంగిస్తారు. నగరంలో జరగుతున్న అభివృద్ధిని వివరిస్తూ మేయర్ ప్రసంగించనున్నారు. అనంతరం.. 2021 – 22 సంవత్సరానికి గాను జీహెచ్ఎంసీ రూపొందించి, 2020 డిసెంబర్ 17 న స్టాండింగ్ కమిటీ ఆమోదించిన బడ్జెట్ ను ప్రవేశపెడతారు. బడ్జెట్ ఆమోదం అనంతరం జరిగే సాధారణ సమావేశంలో పలు అంశాలపై చర్చిస్తారు.
రేపు జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశం
