Mayor Vijayalaxmi: తెల్లవారుజామున వర్షం హైదరాబాద్ ప్రజలను పలకరించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి గంటపాటు కుండపోత వర్షం కురిసింది. ఇంకా చాలా చోట్ల చిరు జల్లులు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షంతో నగరమంతా అస్తవ్యస్తంగా మారింది. తెల్లవారుజామున దట్టమైన మేఘాలు నగరాన్ని పూర్తిగా చుట్టుముట్టాయి. భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. అయితే జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యానికి ఓ చిన్నారి బలైంది. ఓపెన్ డ్రైనేజీలో పడి ఓ చిన్నారి మృతి చెందింది. కాగా చిన్నారి మౌనిక మృతిపై జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్పందించారు. సంఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు.
వరద నీటికి అక్కడ చిన్నపాటి గుంత పడిందని స్పష్టం చేశారు. ఇంతకు ముందుకు అక్కడ అలాంటి గుంత ఏమీ లేదని అన్నారు. ఉదయం కురిసిన భారీ వర్షానికి వరద ఎక్కువ కావడంతో ఆ గుంతలోంచి చిన్నారి కొట్టుకొని పోయిందని అన్నారు. సంఘటనకు కారణమైన అధికారులపై యాక్షన్ తీసుకుంటామని అన్నారు. పదేపదే అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నామని మేయర్ అన్నారు. అయినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటన మరొకటి జరగకుండా అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చనిపోయిన చిన్నారి కుటుంబానికి జిహెచ్ఎంసి తరఫున రెండు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించారు.
Read also: Khushbu Daughter : కిందపైన టాటూతో ఖుష్బు కూతురు.. గ్లామర్ షో
జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యానికి ఓ చిన్నారి బలైంది. ఓపెన్ డ్రైనేజీలో పడి ఓ చిన్నారి మృతి చెందింది. మౌనిక పాల ప్యాకెట్ తీసుకురావడానికి సోదరుడితో కలిసి సికింద్రాబాద్ లోని కళాసిగూడకు వచ్చింది. తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం కారణంగా నిలిచిన నీటిని తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది మ్యాన్‌హోల్స్‌ను తెరిచి ఉంచారు. తమ్ముడు వికలాంగుడు.. తమ్ముడు నీటిలో పడిపోయాడు. అతడిని కాపాడే క్రమంలో చిన్నారి తన తమ్ముడిని కాపాడే క్రమంలో డ్రైనేజీలో పడిపోయింది. పార్క్ లైన్ దగ్గర డీఆర్‌ఎఫ్ సిబ్బంది పాప మృతదేహాన్ని గుర్తించారు. మృతురాలిని నాలుగో తరగతి చదువుతున్న మౌనికగా గుర్తించారు.
Janhvi Kapoor : వేడుకలో జిప్ చిరిగిపోయి ఇబ్బందిపడ్డారట జాన్వీ