Site icon NTV Telugu

GHMC Councel Meeting: ఉదయం 10 గంటలకు GHMC కౌన్సిల్ మీటింగ్.. సర్వత్రా ఆసక్తి

Ghmc Councel Meeting

Ghmc Councel Meeting

చాలా కాలం తరువాత ఇవాళ ఉదయం 10 గంటలకు జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ మీటింగ్‌ జరగనుంది. కొత్త పాలక మండలి వచ్చాక అసెంబ్లీ సమావేశాలను తలపిస్తున్నాయి. గత రెండు సమావేశాల్లో TRS వర్సెస్ బీజేపీ అన్నట్టుగా హోరాహోరీ సాగింది. టీఆర్‌ఎస్‌, బీజేపీ ఒకరిపై ఒకరు ఆరోపణ లు చేసుకోవడంతో అర్దాంతరంగా ముగిసిన గత రెండు బల్దియా సమావేశాలు ముగివాయి. చివరిగా గతంలో ఏప్రిల్ 12 న జరిగిన బల్దియా కౌన్సిల్ మీటింగ్ జరిగింది. గత సమావేశం తర్వాత పార్టీలు మారిన ఐదుగురు కార్పొరేటర్లు పార్టీలు మారారు.

టీఆర్‌ఎస్‌ నుంచి విజయారెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్ళగా.. దీంతో కార్పొరేటర్ల సంఖ్య నాలుగుకు పెరింగింది. అలాగే నలుగురు బీజేపీ కార్పొరేటర్లు కారు ఎక్కారు. ప్రస్తుతం బల్దియాలో పార్టీల బలాబలాలు.. టీఆర్‌ఎస్‌ 59, ఎంఐఎం 44, బీజేపీ 43, కాంగ్రెస్ 4 ఉన్నాయి. ఇక జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ మీటింగ్ రెండు రోజులు నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ప్రజా సమస్యలు కోసం అయితేనే బల్దియా మీటింగ్ పెట్టండి, టీఆర్‌ఎస్‌  బీజేపీ గొడవల కోసం అయితే కౌన్సిల్ మీటింగ్ వద్దు అంటున్న కాంగ్రెస్ అంటోంది. అయితే కౌన్సిల్ మీటింగ్ ను బీజేపీ వాడుకుంటుదంటున్న టీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. ఏదైమైతేనేమి బల్దియా సమావేశం పై రాజకీయ పార్టీల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందస్తుగా 200 మంది పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Mamata Benerjee: మోడీకి మద్దతుగా మమత కామెంట్స్.. ఆశ్చర్యంలో పార్టీ నేతలు

Exit mobile version