Ghatkesar Engineering College Boys Morphed Girls Photos With Their DP: మారుతున్న కాలానికి అనుగుణంగా.. విద్యార్థుల్లో చాలా మార్పు వచ్చేసింది. క్రమశిక్షణతో మెలగకుండా, పాడు పనులకు పాల్పడుతున్నారు. స్మార్ట్‌ఫోన్స్, సామాజిక మాధ్యమాల ప్రభావంతో.. చెడు అలవాట్లను అలవరచుకుంటున్నారు. తోటి విద్యార్థుల్నే వేధింపులకు గురి చేస్తున్నారు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యమే తాజా ఉదంతం. ఘట్కేసర్‌లోని విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కాలేజీలోని యువకులు.. విద్యార్థినుల పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించారు. విద్యాబుద్ధులు నేర్చుకొని, ఉన్నత భవిష్యత్‌కు బాట వేసుకోవాల్సిన ఆ యువకులు.. అమ్మాయిలను వేధింపులకు గురి చేశారు.
Sonu Sood: సోనూసూద్‌పై నార్త్ రైల్వే ఆగ్రహం.. ఇంకోసారి అలా చేయొద్దంటూ వార్నింగ్
విద్యార్థినుల ఫోటో డీపీలను తీసి, వాటిని న్యూడ్ ఫోటోలుగా మార్ఫింగ్ చేస్తున్నారు. అలా మార్ఫింగ్ చేసిన ఫోటోలను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. కొందరు ఆగంతకులు అయితే, మరీ హద్దుమీరారు. ఎవరి ఫోటోలనైతే మార్ఫింగ్ చేశారో, వాటిని ఆ విద్యార్థినులకే రాత్రి సమయంలో పంపి, వేధింపులకు పాల్పడుతున్నారు. దీంతో సహనం కోల్పోయిన విద్యార్థినులు.. ఆందోళనలు చేపట్టారు. ఈ హేయమైన పనికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులపై ఫిర్యాదు కూడా చేశారు. విద్యార్థినుల ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ కీచకానికి ఎవరెవరు పాల్పడ్డారన్న వివరాలను వెలికి తీసే పనిలో నిమగ్నమయ్యారు.
Ram Gopal Varma: చంద్రబాబు నరహంతకుడు.. వర్మ సంచలన వ్యాఖ్యలు
మరోవైపు.. ఈ మార్ఫింగ్ ఫోటోలపై విద్యార్థినులు ఆందోళన చేపట్టడంతో, కాలేజీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయితే, తమతో పాటు కుటుంబం పరువు పోతుందని, వెంటనే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాలేజీ వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు చోటు చేసుకోకూడదనే ఉద్దేశంతోనే పోలీసుల్ని మోహరించారు.