Site icon NTV Telugu

Geeta Reddy: అస్సాం సీఎంపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. తాజాగా ఈ వ్యవహారం మహిళా కమిషన్ వరకూ చేరింది. మహిళా కమిషన్ ని కలిసిన మాజీ మంత్రి గీతా రెడ్డి, రేణుకా చౌదరి రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి పీఠం పై కూర్చున్న మూర్ఖుడు అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మ అన్నారు గీతారెడ్డి.

రాహుల్ గాంధీ పై చేసిన కామెంట్స్ సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. అతడిని సీఎం పీఠం నుంచి పీకిపడేయాలి. సర్జికల్ స్ట్రైక్ గురించి అడిగితే.. తండ్రి ఎవరని అడుగుతారా? నీచమైన కామెంట్స్ చేసినా.. రాహుల్ గాంధీ పల్లెత్తు మాట అనలేదు. మహిళలు అంటే బీజేపీ కి గౌరవం లేదు.. ఉంటే అస్సాం సీఎం పై చర్యలు తీసుకోవాలి. మహిళల తరపున మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశాం. కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి.. తన పరిధిలోకి రాదని కేంద్ర కమిషన్ కు పంపిస్తామని చెప్పారన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి.

https://ntvtelugu.com/bandi-sanjay-lettar-to-cm-kcr/

సవాలుకు జవాబు లేక అస్సాం సీఎం పిచ్చి పిచ్చిగా మాట్లాడారన్నారు కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి. ఖబడ్దార్ హేమంత బిశ్వ శర్మ. ఇది ఆరంభం మాత్రమే మునుముందు చాలా ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో ఆడవాళ్లను హౌస్ అరెస్ట్ చేయడం సిగ్గుచేటు. పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసుల సెక్షన్ లో మార్పు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

Exit mobile version