NTV Telugu Site icon

బ్రేకింగ్‌: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో గ్యాస్ లీక్.. ఒక‌రు మృతి

Shamshabad Airport

హైద‌రాబాద్‌లోని శంషాబాద్ అంత‌ర్జాతీయ విమ‌నాశ్ర‌యంలో గ్యాస్ లీకేజీ ఘ‌ట‌న క‌ల‌క‌లం సృష్టించింది.. ఎయిర్‌పోర్ట్‌లో గ్యాస్ లీక్ కావ‌డంతో.. ఊపిరాడ‌క ముగ్గురు వ్య‌క్తులు స్పృహ‌కోల్పోయారు.. ఆ ముగ్గురు వ్య‌క్తుల‌ను ఎయిర్‌పోర్ట్ సిబ్బంది వెంట‌నే ఎయిర్‌పోర్ట్‌లోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.. ఆస్ప‌త్రిలో చికిత్సపొందుతూ న‌ర్సింహారెడ్డి అనే వ్య‌క్తి మృతిచెందిన‌ట్టుగా చెబుతున్నారు.. మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తులు జాకీర్, ఇలియాస్ ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్సపొందుతున్నారు. గ్యాస్ పైప్ లీక్ కావ‌డంతో ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టుగా చెబుతున్నారు ఎయిర్‌పోర్ట్ అధికారులు.. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.