Cannabis plants: గంజాయి సాగు చేయకూడని, విక్రయించిన, అమ్మిన నేరమని శిక్షార్హులని అధికారులు ఎంతచెబుతున్న గంజాయి ఆగడాలు మాత్రం అస్సలు ఆగడంలేదు. దాని తరలించేందుకు ఏకంగా సినిమాలనే ఫాలో అయిపోతున్నారు గంజాయి దొంగలు. గంజాయి తరలించడం ఒక ఎత్తైతే గంజాయిని ఇంటిపెరట్లోనే సాగుచేయడం ఖమ్మం జిల్లాలో జరిగింది.
Read also: Passenger Attack on Conductor: కండక్టర్ పై ప్రయాణికుడు దాడి.. కారణం తెలిస్తే షాక్ అవుతారు
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతపల్లి గ్రామం ఎస్టీ కాలనీలో గంజాయి మొక్కలను గుర్తించారు ఎక్సైజ్ శాఖ అధికారులు. గ్రామానికి చెందిన పాండ్ల శ్రీరాములు తన ఇంటి ఆవరణములో నాలుగు గంజాయి మొక్కలను సాగు చేసుకుంటున్నాడు ఎక్సైజ్ అధికారులకు విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం అర్దరాత్రి దాడి చేయగా అవి గంజాయి మొక్కలేనని నిర్ధారించారు.
వాటిని ధ్వంసం చేసి స్టేషన్ కు తరలించారు. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేస్తామని ఎక్సైజ్ సీఐ రాంప్రసాద్ తెలిపారు. అయితే పాండ్ల శ్రీరాములు తన కోసమే ఈ గంజాయి మొక్కలు పెంచుకున్నట్లు క్రయ విక్రయాలకు జరిపేందుకు కాదని తెలిపారు.
Xi Jinping: చైనాలో జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా భారీగా నిరసనలు..