Site icon NTV Telugu

బీసీ ముసుగులో ఉన్న పెద్ద దొర ఈటల రాజేందర్ : గంగుల

ఈటల రాజేందర్ పై మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ మేకవన్నె పులి… ఈటల రాజేందర్ పచ్చి అబద్ధాల కోరని మండిపడ్డారు. బీసీ ముసుగులో ఉన్న పెద్ద దొర ఈటల అని మంత్రి గంగుల ఫైర్ అయ్యారు.
ఈటల రాజేందర్ కు సీఎం కేసీఆర్ ను విమర్శించే స్థాయి ఉందా?.. ఈటల టీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఉన్నపుడు ఆ పదవిని దుర్వినియోగం చేశారని నిప్పులు చెరిగారు. బీసీలను దగ్గరకు రానీయలేదు.. ఈటల వ్యాపార భాగస్వామ్యులు కూడా బీసీలు కారని పేర్కొన్నారు. బీసీలను తొక్కే ప్రయత్నం చేశారని..పదవి పోగానే బీసీ బిడ్డను అంటూ మాట్లాడటం దారుణమన్నారు. పదవీ పోగానే ముదిరాజ్ బిడ్డలు గుర్తుకు వచ్చారా? అని ఫైర్ అయ్యారు గంగుల. కమలాపూర్ నియోజావర్గంలో చీమలుపెట్టిన పుట్టలో పాము లాగా ఈటల చేరి ప్రయోజనం పొందాడని…కమలాపూర్ నియోజకవర్గంలో టీఆరెస్ నేతలను బయటకు పంపే ప్రయత్నం ఈటల చేశారని మండిపడ్డారు. పార్టీ గెలిస్తే ఈటెల ఏడ్చే వాడు.. ఓడితే నవ్వే వాడని..ఈటల ప్రతీ ప్రతిపక్ష నేతలతో టచ్ లో ఉన్నాడని ఆరోపించారు.

Exit mobile version