Minister Gangula Kamalakar Detailed about Tomorrow Minister KTR Karimnagar Visit.
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రేపు కరీంనగర్‌లో పర్యటించున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కమాలాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాక ముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నానని, కరీంనగర్ నగరములో ఎక్కడా అభివృద్ధి జరగలేదని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్‌కు నిధులు ఇవ్వాలని కోరానని వెల్లడించారు. తెలంగాణ వచ్చాక నగర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నామని ఆయన తెలిపారు. రేపు కరీంనగర్‌లో కేటీఆర్ చేతుల మీదుగా 615 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని, చరిత్ర ప్రతిబించేలా ఐ ల్యాండ్స్ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శాశ్వత డ్రైనేజి కోసం 133 కోట్ల, 90కోట్లతో రోడ్లకు భూమి పూజ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
23 కోట్లతో కమాండ్ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేస్తున్నామని, రేపు భూమి పూజ చేసిన వెంటనే పనులు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. మానేరు రివర్ ఫ్రెంట్‌తో కరీంనగర్ గొప్ప టూరిజం స్పాట్ గా మారుతుందని, రేపు రూ.410 కోట్లతో మానేరు రివర్ ఫ్రెంట్ పనులు ప్రారంభిస్తామన్నారు. 18 నెలల్లో పనులు పూర్తవుతాయని, బీసీ స్టడీ సర్కిల్ కేటీఆర్ ప్రారంభిస్తారని, మెడికల్ కాలేజ్ కోసం రెండు చోట్లా స్థలాలు చూసినట్లు, వచ్చే సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోందని ఆయన తెలిపారు.