NTV Telugu Site icon

Hyderabad : హైదరాబాద్ నగరంలో రెచ్చిపోతున్న దొంగల ముఠాలు..

Hyderabad Thifes

Hyderabad Thifes

Hyderabad : హైదరాబాద్ నగరంలో దొంగల ముఠాలు రెచ్చిపోతున్నారు. పోలీసులు దొంగల ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్నా దొంగతనాలు మాత్రం ఆగడం లేదు. ఒక్కరోజులో వరుస దొంగతనాలు చేస్తూ పోలీసులకే సవాల్ విసురుతున్నారు. సీసీ కెమరాల్లో రికార్డు అవుతున్నా పోలీసులకు మాత్రం ఆధారాలు మాత్రం సేకరించేలేక పోతున్నారు. ఇదే అలుసుగా చూసుకున్న ముఠాగా ఏర్పడి దోపిడీలకు పాల్పడుతున్నారు. దీంతో నగరంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరుస దోపిడీలు, దొంగతనాలతో అంతర్రాష్ట్ర ముఠాలు హల్చల్ చేస్తున్నాయి. నగరంలో ఎక్కడెక్కడ దొంగల ముఠా తెగబడ్డారంటే..

Read also: CM Chandra babu: అసెంబ్లీలో సీఎం చంద్రబాబు భావోద్వేగం(వీడియో)

వనస్థలిపురంలో దారి దోపిడీ మరవక ముందే మేడ్చల్ లో గోల్డ్ షాప్ లో రాబరికి యత్నం చేసిన ఘటనలు నగర వాసులు భయాందోళనకు గురవుతున్నారు. వనస్థలిపురంలో బ్యాంకు నంచి డ్రా చేసుకొని వస్తున్న వ్యక్తి నుండి 15 లక్షల నగదు, బంగారాన్ని ముఠా కాజేయడంతో సంచలనంగా మారింది. బ్యాంకు సీసీ కెమెరాలో నిందితుల కదలికలు రికార్డు అయ్యాయి. కారులో డబ్బులు బ్యాగు లాక్కొని ఇద్దరు దుండగులు బైక్ పై పరారయ్యారు. నిన్న మేడ్చల్ లో పట్టపగలే గోల్డ్ షాపులోకి జొరబడి దోపిడీకి యత్నించారు. యజమానిపై కత్తితో దాడిచేసి ఇద్దరు దుండగులు బైక్ పై పరారయ్యారు. సీసీ కెమెరాల్లో దృష్యాలు రికార్డ్ అయ్యాయి. సీసీ కెమెరాల్లో దొంగలు కనపడుతున్నా పోలీసులకు దోపిడీ ముఠాల ఆచూకీ ఇప్పటి వరకు దొరకలేదు. హైదరాబాద్ నగరంలో వరుస చోరీలతో ధార్ గ్యాంగ్ హల్చల్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హయత్ నగర్ ప్రజయ్ గుల్మహర్ గేటెట్ కమ్యూనిటీలో ఆరు ఇండ్లలో వరుస చోరీలు పోలీసులకు సవాల్ గా మారింది. పటాన్ చెరువు రుద్రారంలో ఇండ్లలో దొంగల వరుస చోరీలకు పాల్పడ్డారు. ఉప్పల్ చిలుకా నగర్ లో వృద్ద దంపతులను బందించి దోపిడీ యత్నం చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇలా వేరు వేరు చోట్లు వరుస దొంగతనాలు జరుగుతుండటంతో నగర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరి దొంగల ముఠాను పోలీసులు పట్టుకుంటారా? అనేది ప్రజల్లో ప్రశ్నలు మొదలయ్యాయి. మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారనేది వేచి చూడల్సిందే..
Tamilnadu : నుదిటిపై తిలకం.. ఇంటిపేరు ఉండకూడదు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం కొత్త రూల్స్