హైదరాబాదులో భారీ మోసం వెలుగు చూసింది. కార్లను అద్దెకు తీసుకొని బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటుంది ఓ ముఠా. ప్రముఖ కంపెనీ నుంచి కారు లను అద్దెకు తీసుకున్న ముఠా… సబ్సిడీ కార్ల పేరుతోటి బహిరంగ మార్కెట్లో అమ్మేస్తుంది. ప్రభుత్వం నుంచి సబ్సిడీలో కార్లు వస్తున్నాయంటూ మోసం చేస్తుంది. హైదరాబాదులో పలు సంస్థల నుంచి కార్లను అద్దెకు తీసుకున్న ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసారు సైబర్ బాద్ పోలీసులు. ముఠా నుంచి 50 అత్యంత ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్న సైబరాబాద్ పోలీసులు… తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా సబ్సిడీ కార్ల పేరుతోటి విక్రయిస్తున్నట్లు తెలిపారు.