Site icon NTV Telugu

గాంధీ ఆస్పత్రి ఘటన… కీలకంగా మారిన మెడికల్ రిపోర్ట్

గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటనలో విచారణ కొనసాగుతుంది. అయితే ఈ కేసులు మెడికల్ రిపోర్ట్ కీలకంగా మారింది. అయితే గాంధీ ఆసుపత్రి సామూహిక అత్యాచార ఘటనలో ట్విస్ట్ వచ్చింది. మెడికల్ రిపోర్ట్ నమూనాల పరీక్షల్లో మత్తు ప్రయోగం ఆనవాళ్లు లేవు. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో బాధితురాలు నిందితులు తనకు క్లోరోఫాం, మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది. దీంతో బాధితురాలు నుంచి రక్తంతో సహా వివిధ నమూనాలను సేకరించిన ఫోరెన్సిక్‌.. వీటి ఫలితాల్లో క్లోరోఫాం సహా ఇతరాల ఆనవాళ్లు కనిపించలేదని పోలీసులకు రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఉమ మహేశ్వర్ తో పాటు ముగ్గురు సెక్యూరిటీ గార్డులు.

Exit mobile version