Site icon NTV Telugu

Gaddar: బీఆర్ఎస్ ను స్వాగతిస్తున్నాము.. గద్దర్ సంచలన వ్యాఖ్యలు

Gaddar

Gaddar

Gaddar: ఢిల్లీలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రజాగాయకుడు గద్దర్ డిమాండ్ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల తరపున పలు ప్రశ్నలు వేశారు. సకల సంపదలు గల దేశంలో దరిద్రమెట్లుంది? దరిద్రం మొదటి నుండి పాలించిన పాలకులదా? ప్రజలదా? అని ప్రశ్నించారు. పాలసీలల్లో లోపం ఉందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ లో భూమి, నీరు, పని చేసేవారు ఉండగా దరిద్రమెట్లుందిని అన్నారు. ఇది నాదే కాదు ప్రజల ప్రశ్న కూడా అని అన్నారు గద్దర్‌. దీనిమీద సీరియస్ గా అసెంబ్లీలో చర్చ జరగాలని కోరారు.

Read also: Vikarabad Love Success: ప్రియురాలా మజాకా.. ధర్నాచేసి ప్రియున్నే పెళ్లాడింది

పార్లమెంటు కు అంబేద్కర్ పేరు పెట్టడం కూడా రాజకీయాంశమే అని ఆరోపించారు. పార్లమెంటుకు పేరు పెట్టడం అనేది అసెంబ్లీలో చర్చ చేసి పేరు పెట్టాలని కోరారు. డా.బీఆర్ అంబేద్కర్ పేరు పెడితే రాజ్యాంగాన్ని ఆచరించినట్టే అని కోరారు. బీఆర్‌ఎస్‌ ను మేము స్వాగతిస్తున్నామని అన్నారు. నూతన సెక్రటరీ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టినందుకు ధన్యవాదాలన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో డా. బీఆర్ అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని కూడా చేర్చాలని కోరుతున్నామన్నారు గద్దర్‌. అయితే.. పార్లమెంట్ కు ఆయన పేరు పెట్టడం అనేది అసెంబ్లీలో చర్చ చేయాలన్నారు. ఇక.. అంబేద్కర్ పేరు పెడితే రాజ్యాంగాన్ని ఆచరించినట్టేనని అభిప్రాయపడ్డారు.
KTR: సత్తా చాటిన కేటీఆర్‌.. ప్రపంచంలోనే టాప్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ లిస్టులో చోటు

Exit mobile version